Motorola Edge 50 Pro : అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో మీ బడ్జెట్ ధరలోనే.. డోంట్ మిస్..!
Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డిస్కౌంట్ ధరకే కొనేసుకోండి. అమెజాన్‌లో ధర ఏకంగా రూ. 13,800 తగ్గింపు పొందింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? అయితే ఇదే అద్భుతమై టైమ్.. ప్రస్తుతం అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై ఊహించని డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ మీకోసమే.. రూ. 13,800 కన్నా భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ కలర్ కచ్చితమైన డిస్‌ప్లే, రోజువారీ పర్ఫార్మెన్స్, సూపర్-ఫాస్ట్ 125W ఛార్జింగ్‌తో ప్రత్యేకంగా ఉంటుంది.

ఈ ఫీచర్లతో ప్రీమియం వ్యూ ఎక్స్‌పీరియన్స్, స్పీడ్ బ్యాటరీ టాప్-అప్ కోరుకునే ఎవరికైనా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అద్భుతమైన ఆప్షన్. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ ఆఫర్ ముగిసేలోపు కొనేసుకోవచ్చు. ఈ డీల్ వివరాలు ఇలా ఉన్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB) ధర రూ.35,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం, అమెజాన్‌లో కేవలం రూ.23,390కు అందుబాటులో ఉంది. రూ.12,609 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఈఎంఐ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఉపయోగిస్తే.. అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. ధర మరింత తగ్గింపు కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా, 125W వైర్డ్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోలో 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ 2,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ ఉన్నాయి.

కెమెరాల విషయానికొస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రిపుల్ రియర్ సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా కలిగి ఉంది.
