Motorola Edge 60 Pro : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఫోన్ మరి ఇంత తక్కువా? ఎలా కొనాలంటే?
Motorola Edge 60 Pro : మోటోరోలా కొత్త మిడ్-రేంజ్ ఫోన్ ఎడ్జ్ 60 ప్రో అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 22,400 వరకు సేవ్ చేసుకోవచ్చు.
Motorola Edge 60 Pro
- మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 6.7-అంగుళాల pOLED డిస్ప్లే సెటప్
- 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీ సెటప్
- ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 22,400 వరకు ఆదా
Motorola Edge 60 Pro : మీరు కొత్త మిడ్-రేంజ్ మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 50MP, ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ 4nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 90W టర్బోపవర్, 15W వైర్లెస్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీ ఉంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోపై ఈ డీల్స్, ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర, ఆఫర్లు :
ఈ మోటో ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,999 ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 2,450 తగ్గింపు వంటి బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. తద్వారా ధర రూ. 27,549 అవుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 22,400 వరకు సేవ్ చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్స్, ఎక్స్చేంజ్, ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ ప్రో ఫోన్ 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందించే 6.7-అంగుళాల pOLED డిస్ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ 4nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 6,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 90W టర్బోపవర్ 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫొటో ఫోకస్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. మోటరోలా ఎడ్జ్ 60 ప్రోలోని కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.4, వై-ఫై 6E, 5G, NFC, జీపీఎస్ కనెక్టివిటీ ఉన్నాయి.
