Motorola Edge 70 Pro : మోటరోలానా మజాకా.. కొత్త మోటోరోలా ప్రో ఫోన్ వస్తోందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయిగా.. ధర ఎంత ఉండొచ్చంటే?
Motorola Edge 70 Pro : కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో లాంచ్ కాబోతుంది. ఏప్రిల్ 22న భారత మార్కెట్లోకి ఎంట్రీ కానుంది. అంతకన్నా ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలివే
Motorola Edge 70 Pro
- ఏప్రిల్ 22న ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్ల ద్వారా లాంచ్ కానుంది
- డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ చిప్, 16GB వరకు ర్యామ్
- అమోల్డ్ డిస్ప్లే, 6,500mAh భారీ బ్యాటరీ ఆప్షన్
- ఏఐలో-లైట్ ఫీచర్లతో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఆప్షన్
- లిల్లీ వైట్, టీ, టైటాన్ కలర్ ఆప్షన్లలో స్పెషల్ ఫినిషింగ్
Motorola Edge 70 Pro : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. మోటోరోలా ఎడ్జ్ లైనప్‌ను కంపెనీ విస్తరించనుంది. గత ఏడాదిలో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 70 లైనప్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ చేరనుంది. కంపెనీ అధికారికంగా స్పెసిఫికేషన్లను రివీల్ చేయలేదు. కానీ, లీకులు, పుకార్లు, టీజర్లతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మోటోరోలా ఫోన్ మైక్రోసైట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మోటోరోలా (Motorola Edge 70 Pro) కెమెరా, పర్ఫార్మెన్స్, కలర్ ఆప్షన్లతో పాటు, ఏఐ ఆధారిత లో-లైటింగ్ ఫొటోగ్రఫీ వంటి కీలక ఫీచర్లు ఉండనున్నాయి. భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్లు, ధరతో సహా పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో కలర్ ఆప్షన్లు :
మోటోరోలా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫోన్ వివరాలను రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లిల్లీ వైట్, టీ, టైటాన్ అనే 3 కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. ఈ 3 వేరియంట్లు వేర్వేరు ఫినిషింగ్‌లతో వస్తుందని భావిస్తున్నారు. కొత్త టీ ఆప్షన్ శాటిన్ లక్స్ ఫినిషింగ్, టైటాన్ వేరియంట్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్‌తో రావచ్చు. లిల్లీ వైట్ వెర్షన్ మార్బుల్ ఫినిషింగ్‌తో వస్తుందని అంచనా.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ చిప్సెట్తో మార్కెట్లోకి రానుంది. ఇందులో 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయని అంచనా.
ఈ మోటోరోలా ఫోన్ 6.8-అంగుళాల 1.5K అమోల్డ్ ప్యానెల్, 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అందిస్తుందని అంచనా. లీకుల ప్రకారం.. కాంతిలో ఈ డిస్ప్లే 5,200 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోలో 6,500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత స్కిన్ మోటోరోలా హలో యూఐతో వస్తుందని, మోటో ఏఐకి సపోర్ట్ ఇస్తుందని అంచనా. ఈ మోటోరోలా ఫోన్ 3 ఏళ్ల OS అప్గ్రేడ్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా లభిస్తాయని అంచనా.
కెమెరాల పరంగా చూస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉండొచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో లాంచ్ తేదీ, ధర ఎంతంటే? :
మోటోరోలా ఈ కొత్త ఫోన్ పూర్తి వివరాలను వెల్లడించలేదు. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఏప్రిల్ 22న లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. అయితే, కొనుగోలుదారులు ఈ మోటోరోలా ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇ-స్టోర్, ప్రముఖ రిటైల్ స్టోర్ల నుంచి పొందవచ్చు. నివేదికల ప్రకారం.. ఈ మోటోరోలా ఫోన్ సుమారు రూ. 31,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి రావచ్చు. అయితే, ధర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.
