Nothing B-Series : నథింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. నథింగ్ (b) సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాకు ఫస్ట్ టైమ్.. ఫుల్ డిటెయిల్స్..!
Nothing B-Series : నథింగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఈ నథింగ్ మోడల్ ఈసారి (b) సిరీస్ తో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అది కూడా భారతీయ మార్కెట్లో ముందుగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Nothing B-Series
- నథింగ్ నుంచి బి-సిరీస్ ప్రొడక్టు అత్యంత సరసమైన ధరలో రావొచ్చు
- భారత మార్కెట్లో త్వరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసే అవకాశం
- సీఎంఎఫ్ హ్యాండ్సెట్ ప్రాజెక్టులను నథింగ్‌కు అప్పగింత
Nothing B-Series : నథింగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఇప్పటివరకూ నథింగ్ ఫోన్లలో (a) సిరీస్ చూశాం.. ఇకపై (b) సిరీస్ కూడా తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అతి త్వరలో నథింగ్ భారతీయ మార్కెట్లో కొత్త నథింగ్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ కొత్త ఫోన్ (b) అనే పేరుతో టీజ్ చేసింది. అయితే, అదేంటో వివరాలను రివీల్ చేయలేదు. కంపెనీ ‘b’ అనే పేరుతో ప్రొడక్టు లాంచ్ ప్లాన్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
భారత మార్కెట్లోకి సరికొత్త ఫోన్ :
గతంలో కంపెనీ అన్ని ప్రొడక్టులను ‘a’ అనే పేరుతో లాంచ్ చేసింది. ఈసారి కంపెనీ కొత్త పేరుతో ఫోన్లను (Nothing B-Series) లాంచ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. నథింగ్ త్వరలో భారత మార్కెట్లో ఒక సరికొత్త ఫోన్ రిలీజ్ చేయనుంది. దీన్నే (b)గా సూచించారు. అంటే ఆ కంపెనీ కొత్త ‘b’ సిరీస్‌లో ఫస్ట్ టైమ్ ఒక ప్రొడక్టును రిలీజ్ చేయనుందని అర్థం.
కార్ల్ పీ నేతృత్వంలోని ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ, తన సబ్-బ్రాండ్ ఇప్పటికే ఉన్న హ్యాండ్సెట్ ప్రాజెక్ట్‌లను నథింగ్‌కు బదిలీ చేసిన తర్వాత, భారతదేశంలో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి యోచిస్తోందని ఒక టిప్‌స్టర్ పేర్కొన్నారు.
ఈసారి నథింగ్ (a) కాదు.. నథింగ్ (b) :
కంపెనీ ఉత్పత్తి పేరును గానీ, డివైజ్ కేటగిరీని గానీ వెల్లడించలేదు. కానీ, (a), (b)పేర్లతో సూచించింది. కంపెనీ ఇప్పటికే ఉన్న సిరీస్ నుంచి ఒక ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఉదాహరణకు.. కంపెనీ (a) సిరీస్‌లోని ప్రొడక్టులలో సాధారణంగా (సంఖ్య) సిరీస్‌లో కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. (b) సిరీస్ ఉత్పత్తి కూడా (సంఖ్య) సిరీస్ ఉత్పత్తికి చౌకగా ఉండొచ్చు. ఇక (a) సిరీస్ విషయానికి వస్తే.. కంపెనీ ఇటీవల నథింగ్ ఫోన్ 4a ప్రోతో పాటు నథింగ్ ఫోన్ 4aను కూడా లాంచ్ చేసింది.
ఇదిలా ఉండగా, సీఎంఎఫ్ కంపెనీ నుంచి మరో కీలక అప్డేట్ రాబోతోంది. సీఎంఎఫ్ హ్యాండ్సెట్ ప్రాజెక్టులను నథింగ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ కంపెనీ ఈ ఏడాది మరిన్ని ఫోన్లను లాంచ్ చేసే అవకాశం లేదు.
అంతేకాదు.. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో లాంచ్ కూడా ఆలస్యం కావచ్చు. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. ఈ ఏడాది భారత మార్కెట్లో సీఎంఎఫ్ కొత్త ఫోన్లను లాంచ్ చేయదు. ఈలోగా, నథింగ్ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
