Nothing Phone Series : నథింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఈ నథింగ్ ఫోన్లు చాలా కాస్ట్లీ గురూ.. కొత్త ధరలు చూస్తే షాకవ్వాల్సిందే..!
Nothing Phone 4a Series : ప్రపంచవ్యాప్తంగా ర్యామ్ స్టోరేజ్ ధరలు పెరగడంతో అనేక బ్రాండ్లు స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచుతున్నాయి. లండన్‌కు స్మార్ట్‌ఫోన్ మేకర్ 'నథింగ్' కూడా భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ల ధరలను భారీగా పెంచింది.
Nothing Phone 4a Series
- భారత మార్కెట్లో భారీగా పెరిగిన నథింగ్ ఫోన్ల ధరలు
- నథింగ్ ఫోన్ 4ఎ, 4ఎ ప్రో, 3ఎ లైట్ ఫోన్ల ధరల పెంపు
- అనేక మోడళ్లపై ఏకంగా రూ. 5వేల వరకు పెరిగిన ధరలు
Nothing Phone 4a Series : నథింగ్ ఫోన్ అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్.. లండన్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘నథింగ్’ భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్ల ధరలను సైలెంట్ గా పెంచేసింది. అనేక మోడళ్లలో నథింగ్ ఫోన్ల ధరలు రూ. 5వేల వరకు పెరిగాయి. ఈ కొత్త ధరలతో వన్ ప్లస్ 4ఎ సిరీస్ ఫోన్లు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఫోన్లలో ఒకదాన్ని కొనాలని ప్లాన్ చేస్తుంటే పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధరల పెంపు ఎందుకంటే? :
నథింగ్ బ్రాండ్ ధరల పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ధరల పెంపు (Nothing Phone Series) వెనుక కారణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెమరీ, ముఖ్యంగా ర్యామ్ స్టోరేజ్ ఖర్చులు, మొబైల్ పరిశ్రమ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఫోన్ బ్రాండ్లు ఫోన్ల ధరలను పెంచాయి. నథింగ్ కూడా అదే బాటలో ధరలను పెంచేసింది.
నథింగ్ ఫోన్ 3ఎ లైట్ ధర మళ్లీ పెరిగింది
ఎంట్రీ-లెవల్ ఫోన్ (3a) లైట్ ధర కూడా పెరిగింది. ఈ ఫోన్ ధర పెరగడం ఇది రెండోసారి.
8GB + 128GB: ఇప్పుడు రూ. 27,999 (గతంలో రూ. 24,999)
8GB + 256GB: ఇప్పుడు రూ. 29,999 (గతంలో రూ. 26,999)
వేరియంట్లన్నింటిలోనూ ఏకంగా రూ. 3వేలు పెరిగింది. గతంలో కన్నా చాలా కాస్టలీ కూడా.
నథింగ్ ఫోన్ 4ఎ ధర రూ. 3,000 పెరిగింది
స్టాండర్డ్ ఫోన్ (4a) ధర కూడా అన్ని వేరియంట్లలో రూ. 3వేలు పెరిగింది.
8GB + 128GB: రూ. 34,999 (గతంలో రూ. 31,999)
8GB + 256GB: రూ. 37,999 (గతంలో రూ. 34,999)
12GB + 256GB: రూ. 40,999 (గతంలో రూ. 37,999)
టాప్ వేరియంట్ ధర సులభంగా రూ. 40వేల మార్కును దాటింది.
నథింగ్ ఫోన్ 4ఎ ప్రో మోడల్ :
అన్ని వేరియంట్లలో రూ. 5వేలు పెరిగింది.
8GB + 128GB: రూ. 44,999 (గతంలో రూ. 39,999)
8GB + 256GB: రూ. 47,999 (గతంలో రూ. 42,999)
12GB + 256GB: రూ. 50,999 (గతంలో రూ. 45,999)
