×
Ad

OnePlus 13 Discount : వన్‌ప్లస్ 13 ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఒకేసారి రూ. 14వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్

OnePlus 13 Discount : వన్‌ప్లస్ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ప్లాట్ ఫారంపై ఒకేసారి రూ. 14వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 23, 2026 / 06:04 PM IST

OnePlus 13

  • భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 రూ. 69,999 ప్రారంభ ధరకు లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.59,293కి లిస్టింగ్, రూ.10,706 ఫ్లాట్ డిస్కౌంట్
  • బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేసుకోవచ్చు

OnePlus 13 Discount : కొత్త ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్. వన్‌ప్లస్ ఫోన్ లవర్స్ కోసం అదిరిపోయే డీల్. మీ బడ్జెట్‌ ధరలోనే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో రూ. 14వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది. సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్ఫార్మెన్స్ కోరుకునే కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కస్టమర్‌లు వన్‌ప్లస్ 13 డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వన్‌ప్లస్ 13 డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 రూ.69,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.59,293కి లిస్ట్ అయింది. రూ.10,706 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Buying House Guide : కొత్త ఇల్లు కొంటున్నారా? చౌకైన హోం లోన్లు అందించే బ్యాంకులివే.. ఎందులో వడ్డీ తక్కువంటే?

వన్‌ప్లస్ 13 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల QHD+ ఎల్టీపీఓ 3K డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+కి సపోర్టు ఇస్తుంది. 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, అడ్రినో 830 జీపీయూతో వస్తుంది.

అంతేకాదు, ఈ ఫోన్ 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా, వన్‌ప్లస్ 13 మోడల్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 120x డిజిటల్ జూమ్ వరకు, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ వన్ ప్లస్ ఫోన్ సెల్ఫీల కోసం 32MP కెమెరాతో వస్తుంది.