OnePlus Nord CE6 : గెట్ రెడీ.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 సిరీస్ వస్తోందోచ్.. లాంచ్ డేట్ ఇదే.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలు
OnePlus Nord CE6 Series : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ 7,000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా.
OnePlus Nord CE6
- మే 7న భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6, నార్డ్ సీఈ 6 లైట్ లాంచ్
- 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్ప్లే ఆప్షన్లు
- 8,000mAh బ్యాటరీ సెటప్, 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్
OnePlus Nord CE6 Series : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ వచ్చే నెలలో భారత మార్కెట్లో 2 స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6, నార్డ్ సీఈ 6 లైట్ కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ సిరీస్‌లో ఇటీవలే వన్‌ప్లస్ నార్డ్ 6 మోడల్ లాంచ్ చేసింది.
అయితే, వచ్చే మే 7న భారత మార్కెట్లో కొత్త వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6, నార్డ్ సీఈ 6 లైట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 మోడల్ 1.5K రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ఉంటుంది.
మొత్తం 3 కలర్ ఆప్షన్లలో :
స్పెషల్ టచ్ రిఫ్లెక్స్ చిప్‌తో వస్తుంది. డ్యూయల్-చిప్ ఆర్కిటెక్చర్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెస్పాన్స్, పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6లో కొన్ని గేమ్‌ల కోసం 144 FPSతో 3,200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రెష్ బ్లూ, లూనార్ పెర్ల్, పిచ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6లో 6-యాక్సిస్ గేమింగ్ గైరోస్కోప్ ఉంటుంది. థర్మల్ మేనేజ్మెంట్ కోసం ఇందులో 33,000 చదరపు మిల్లీమీటర్లకు పైగా హీట్ అందించే భారీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది.
Read Also : Summer AC Tips : మీ ఇంట్లో AC కూలింగ్ సమస్యా? మెకానిక్‌తో పనిలేదు.. ఈ 5 సింపుల్ ట్రిక్స్ చాలూ!
సింగిల్ ఛార్జ్.. 2. 5రోజులకు పైగా ఛార్జింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,000mAh బ్యాటరీ ఉంటుంది. 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 2.5 రోజులకు పైగా పనిచేస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ వివిడ్ మింట్, హైపర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ స్మార్ట్‌ఫోన్ CPH2943 మోడల్ నంబర్‌తో గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ సైట్లో లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్టింగ్ 1,068 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 2,953 పాయింట్లు సాధించింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్లో 7,000mAh బ్యాటరీ ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఉండవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LCD డిస్ప్లే ఉండవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉండవచ్చు. సేఫ్టీ కోసం పక్కన ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండవచ్చు.
