Oppo Find X9 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 ధర భారీగా తగ్గిందోచ్.. రూ. 10వేలకుపైగా డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?
Oppo Find X9 Price : ఒప్పో ఫైండ్ ఎక్స్9 ఫోన్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
Oppo Find X9 Price ( Image Credit : Google Gemini AI )
- ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 బ్యాంక్ ఆఫర్లతో తక్కువ ధరకే
- ఈ ఫోన్ పవర్ఫుల్ డైమెన్సిటీ 9500 చిప్, భారీ బ్యాటరీ సెటప్
- ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ కూడా
Oppo Find X9 Price : కొత్త ఒప్పో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఒప్పో ఇండియా నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఒప్పో ఫైండ్ X9s, ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా పేరుతో రానున్నాయి.
అంతకన్నా ముందుగానే ఫ్లిప్‌కార్ట్‌లో స్టాండర్డ్ ఒప్పో ఫైండ్ X9 ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్‌ను (Oppo Find X9 Price) ఫస్ట్ టైమ్ రూ. 74,999కి లాంచ్ చేయగా, ఇప్పుడు కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్లతో రూ. 65వేల లోపు ధరకే పొందవచ్చు.
కెమెరాలు, ఫ్లాగ్షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ అందించే మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఒప్పో ఫైండ్ X9లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్, బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్ హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. పూర్తి ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 డీల్ :
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అసలు ప్రారంభ ధర రూ. 74,999పై రూ. 7వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌తో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 67,999కి లభ్యమవుతుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఇంకా డిస్కౌంట్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 3,875 డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ఫైనల్ ధర రూ. 64,124కు తగ్గుతుంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్‌లో నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ కింద కనీస నెలవారీ వాయిదా రూ. 2,392 చెల్లించాలి.
ఒప్పో ఫైండ్ ఎక్స్9 కొనాలా? :
ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 1.5K రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. నేరుగా సన్ లైట్ పడితే ఈ డిస్ప్లే 3,600 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్తో 12GB వరకు ర్యామ్ 512GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్లో 7,025mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ 10W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఒప్పో ఫోన్ హాసెల్‌బ్లాడ్ ట్యూన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, OISతో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ప్రస్తుత డిస్కౌంట్ ధరలో ఒప్పో ఫైండ్ X9 అద్భుతమైన ఆప్షన్.
