Oppo Find X9 Pro : ఒప్పో ఫైండ్ X9 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ. 14వేలు తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?
Oppo Find X9 Pro : ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 ప్రో మీ బడ్జెట్ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ ఎలా పొందాలంటే?
Oppo Find X9 Pro
- భారత్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో రూ. 1,09,999 ధర లాంచ్
- ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ రూ. 99,999 ధరకు లభిస్తోంది
- రూ. 10వేలు నేరుగా ధర తగ్గింపు, బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఆదా
Oppo Find X9 Pro : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఒప్పో ప్రో మోడల్ మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. తద్వారా రూ. 14వేల వరకు ఆదా చేయొచ్చు. ఇలాంటి డీల్స్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మోడళ్లపై ఎక్కువ కాలం రోజులు ఉండవు. ధర తక్కువగా ఉన్నప్పుడే కొనేసుకోవడం బెటర్. పూర్తి ఆఫర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో ధర రూ. 1,09,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ (Oppo Find X9 Pro) ప్రస్తుతం రూ. 99,999 ధరకు లభిస్తోంది. రూ. 10వేలు నేరుగా డిస్కౌంట్ లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
ఒప్పో ఫైండ్ X9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫైండ్ X9 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి. అంతేకాదు.. ఈ ఫోన్లో 7,500mAh బ్యాటరీ కూడా ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ X9 ప్రోలో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో కొనాలా వద్దా? :
ఫొటోగ్రఫీ, బ్యాటరీ లైఫ్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్ ఒప్పో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా చెప్పొచ్చు. ఈ ఒప్పో ఫోన్ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. ఈ సరికొత్త జనరేషన్ ఫ్లాగ్‌షిప్‌పై భారీ తగ్గింపు పొందడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఒప్పో ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.
