Oppo Reno 16t Launch : సూపర్ ఫోన్ బ్రో.. కొత్త ఒప్పో రెనో 16T వచ్చేసింది, ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Oppo Reno 16t Launch : ఒప్పో రెనో 16T చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో 200MP ట్రిపుల్ కెమెరా, 120Hz అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్ 6700mAh బ్యాటరీ ఉన్నాయి. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
Oppo Reno 16t Launch
- 200MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫొటో సెన్సార్
- 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6700mAh బ్యాటరీ
- 120Hz అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్
Oppo Reno 16t Launch : ఒప్పో నుంచి సరికొత్త రెనో 16T స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్లో కంపెనీ కాంపాక్ట్ డిజైన్‌తో పాటు కెమెరా బ్యాటరీ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్లో 6.32-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్ప్లే ఉండగా, పర్ఫార్మెన్స్ పరంగా మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్ అందించారు. ఈ ఫోన్లో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. పవర్ కోసం 6700mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఒప్పో రెనో 16T ఫోన్ 2640×1216 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లకు సపోర్ట్ చేస్తుంది 460 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఈ స్క్రీన్ 1,800 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది.
ఈ ఫోన్ 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ కూడా అందిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఒప్పో రెనో 16టీ మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్తో రన్ అవుతుంది. దీనికి 12GB వరకు LPDDR5X/LPDDR5 ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది.
Read Also : Supreme Court On UPI: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు!
కంపెనీ ఫోన్‌కు లెఫ్ట్ సైడ్ ఏఐ ప్లస్ కీని కూడా అందించింది. మైండ్ స్పేస్‌ను యాక్సెస్ కోసం వాడొచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6, బ్లూటూత్, ఎన్ఎఫ్సి, యూఎస్బి టైప్-సి డ్యూయల్ నానో సిమ్ ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే.. :
ఒప్పో రెనో 16T ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. 116-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. థర్డ్ కెమెరా OISతో 50MP టెలిఫోటో సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ 3.5x ఆప్టికల్ జూమ్ 120x డిజిటల్ జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఒప్పో రెనో 16T ఫోన్ 6700mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 80W సూపర్ వూక్ 80W UFCS ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది.
కలర్ బట్టి ఈ ఫోన్ 8.36mm మందంతో 191 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. మన్నిక కోసం ఈ ఫోన్‌కు IP68, IP69K డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది.
ఒప్పో రెనో 16T ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.53వేలు). 16GB + 512GB వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ హార్ట్‌బీట్, గెలాక్సీ పర్పుల్ మూన్లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం, ఒప్పో రెనో 16Tని చైనాలో లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ ఎప్పుడు అనేది కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
