POCO M7 5G Offer : వాలెంటైన్స్ డే సేల్.. ఈ పోకో 5G ఫోన్ చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
POCO M7 5G Offer : పోకో M7 5G ఫోన్ ఏకంగా రూ. 2,800 తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌లో కేవలం రూ. 10,199 చెల్లిస్తే చాలు.. ఈ ఫోన్ మీ సొంతం అవుతుంది.
POCO M7 5G Offer
- ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
- పోకో M7 5జీ ఫోన్ కొనుగోలుపై రూ. 2,800 డిస్కౌంట్
- బ్యాంకు ఆఫర్లతో అదనంగా రూ. 1000 తగ్గింపు
POCO M7 5G Offer : పోకో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పోకో M7 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం రూ. 12వేల బడ్జెట్ లోపు ధరలో కొనేసుకోవచ్చు. 6.88-అంగుళాల పెద్ద HD+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 5160mAh బ్యాటరీ ప్యాక్, 50MP ప్రైమరీ కెమెరా వంటి పవర్ఫుల్ ఫీచర్లతో వస్తుంది.
బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ కోరుకునే కస్టమర్లకు ఈ పోకో 5జీ అద్భుతంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్ సందర్భంగా తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. ఇంతకీ పోకో M7 5జీ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 2,800 డిస్కౌంట్ :
భారత మార్కెట్లో పోకో M7 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999కి లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్ ఆఫర్లో 14శాతం తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఇదే ఫోన్‌ను కేవలం రూ. 11,199కి కొనుగోలు చేయవచ్చు. మీ దగ్గర ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే రూ. 1,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఈ పోకో ఫోన్ కొనుగోలుపై కేవలం రూ. 10,199 చెల్లించాలి. సేల్ సమయంలో రూ. 2,800 సేవ్ చేసుకోవచ్చు. అలాగే, ఒకేసారి ఫుల్ పేమెంట్ చేయలేకుంటే.. ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అయితే, నెలకు రూ. 494 చొప్పున 24 నెలల పాటు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
పోకో M7 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ సెన్సార్, ఆక్సిలరీ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5160mAh బ్యాటరీ కూడా ఉంది. ఫోన్ బాక్స్ లోపల 33W ఛార్జర్ కూడా అందిస్తుంది.
డిస్ప్లే, డిజైన్ :
పోకో M7 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.88-అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. కంటి సేఫ్టీ కోసం ట్రిపుల్ TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ పొందుతుంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్ ఉంది. ఈ ఫోన్లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సి పోర్ట్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ కనెక్టివిటీ, Wi-Fi 5 ఉన్నాయి.
పర్ఫార్మెన్స్ :
పోకో M7 5జీ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో 2.2GHz వరకు క్లాక్ స్పీడ్‌తో రన్ అవుతుంది. ఈ పోకో ఫోన్ 6GB లేదా 8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్వేరియంట్లలో వస్తుంది. స్పెషల్ మైక్రో SD కార్డ్ స్లాట్‌తో 1TB వరకు విస్తరించుకోవచ్చు.
