REDMAGIC 12 Pro Plus : 8400mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

REDMAGIC 12 Pro Plus : రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ చైనాలో లాంచ్ అయింది. 8400mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, 185Hz OLED డిస్‌ప్లే, 50MP కెమెరాలు, ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

REDMAGIC 12 Pro Plus

  • గేమర్లకు పండగే.. రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+లో అదిరిపోయే ఫీచర్లు
  • 8400mAh బ్యాటరీతో కొత్త రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ వచ్చేసింది
  • 120W ఫాస్ట్ ఛార్జింగ్, 185Hz డిస్‌ప్లే.. ధర ఎంతో తెలుసా?

REDMAGIC 12 Pro Plus : గేమింగ్ లవర్స్ కు పండగే.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మ్యాజిక్ మరో పవర్‌ఫుల్ ఫోన్‌తో సందడి చేస్తోంది. భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ను చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో గేమర్లను, టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ ఫోన్ ధర ఎంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఓసారి లుక్కేద్దాం..

రెడ్‌మ్యాజిక్ 12 ప్రో ప్లస్ ధర ఎంతంటే? :
రెడ్‌మ్యాజిక్ 12 ప్రో ప్లస్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర 6,999 యువాన్లు. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 7,999 యువాన్లు. ఇక టాప్-ఎండ్ 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ మోడల్ ధర 8,999 యువాన్లు. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. భారత్‌లో లాంచ్ ధరపై క్లారిటీ లేదు.

డిస్‌ప్లే, ప్రాసెసర్ అదుర్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.85 అంగుళాల 1.5K BOE X10 ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. 2688×1216 పిక్సెల్స్ రిజల్యూషన్, 185Hz రిఫ్రెష్ రేట్, 960Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత స్మూత్‌గా ఉండనుంది. గరిష్ఠంగా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్ కూడా అందిస్తుంది.

Read Also : OnePlus Ace 7 Series : గేమర్లకు పండగే! వన్‌ప్లస్ ఏస్ 7 వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో అదరగొట్టే ఫీచర్లు!

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 చిప్‌సెట్‌తో పాటు అడ్రినో 850 జీపీయూ, రెడ్ కోర్ R5 కో-ప్రాసెసర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17 ఆధారిత రెడ్‌మ్యాజిక్ OS 12పై రన్ అవుతుంది.

8400mAh బ్యాటరీ.. కెమెరాలు ఎలాగంటే? :
ఈ ఫోన్‌లో 8,400mAh భారీ బ్యాటరీని అందించారు. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ OISతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP అండర్-డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, 5G, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. IPX8 రేటింగ్‌తో ఈ ఫోన్ గేమింగ్, బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.