Reliance Jio Plan : రిలయన్స్ జియో చౌకైన ప్లాన్ ఇదిగో.. 84 రోజుల వ్యాలిడిటీ, మరెన్నో డేటా బెనిఫిట్స్.. డోంట్ మిస్..!
Reliance Jio Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చౌకైన ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లలో చాలా తక్కువ ధరకు లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అందిస్తోంది. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.
![Reliance Jio Plan : రిలయన్స్ జియో చౌకైన ప్లాన్ ఇదిగో.. 84 రోజుల వ్యాలిడిటీ, మరెన్నో డేటా బెనిఫిట్స్.. డోంట్ మిస్..! Reliance Jio Plan : రిలయన్స్ జియో చౌకైన ప్లాన్ ఇదిగో.. 84 రోజుల వ్యాలిడిటీ, మరెన్నో డేటా బెనిఫిట్స్.. డోంట్ మిస్..!](https://10tv.in/wp-content/uploads/2023/09/Reliance-Jio-cheapest-plan-84-days-validity-is-available-for-less-than-Rs-400.jpg)
Reliance Jio cheapest plan, 84 days validity is available for less than Rs 400
Reliance Jio Plan : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ. ఎయిర్టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కన్నా జియో చాలా రెట్లు ఎక్కువ కస్టమర్లను కలిగి ఉంది. కంపెనీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు, ప్లాన్లను తీసుకువస్తూనే ఉంటుంది. జియో ప్రతి కస్టమర్ కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. మీ సౌలభ్యం ప్రకారం.. రీఛార్జ్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. జియో వారి కోసం చాలా ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది.
జియో తన రీఛార్జ్ ప్లాన్ల అనేక కేటగిరీలుగా విభజించింది. మీరు స్వల్పకాలిక నుంచి దీర్ఘకాలిక ప్లాన్లను ఎంచుకోవచ్చు. జియో కస్టమర్ల కోసం చౌక రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో చాలా తక్కువ ధరకు లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అందిస్తోంది. జియో ప్లాన్‌లో యూజర్లు 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అంటే.. సుమారు 3 నెలలు, రూ. 400 కన్నా తక్కువ ఖర్చు చేయాలి.
84 రోజుల వ్యాలిడిటీ చౌక ధరకే :
జియో చాలా తక్కువ ధరకు లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అందిస్తోంది. జియో లిస్టులో రూ. 395 ప్లాన్ ఉంది. జియో యూజర్లు 84 రోజుల లాంగ్ టైమ్ వ్యాలిడిటీని పొందవచ్చు. జియో ఈ ప్లాన్ (My Jio) లేదా (Jio.com)లో లిస్టు అయింది. మీరు వెబ్‌సైట్‌లోని మొబైల్ సెక్షన్ నుంచి ప్రీపెయిడ్ ఆప్షన్ వెళ్లాలి. దీని తర్వాత ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ వాల్యూను పొందవచ్చు.
![Reliance Jio Plan : రిలయన్స్ జియో చౌకైన ప్లాన్ ఇదిగో.. 84 రోజుల వ్యాలిడిటీ, మరెన్నో డేటా బెనిఫిట్స్..! Reliance Jio cheapest plan, 84 days validity is available for less than Rs 400](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/09/Reliance-Jio-cheapest-plan-84-days-validity-is-available-for-less-than-Rs-400-1.jpg)
Reliance Jio cheapest plan, 84 days validity is available for less than Rs 400
ప్లాన్‌లో డేటా :
రూ. 395 రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే.. లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో పాటు, 84 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. 84 రోజులకు జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 6GB డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. డేటా లిమిట్ ముగిసిన తర్వాత మీరు 64kbps స్పీడ్‌తో డేటాను ఉపయోగించవచ్చు.
ఇతర బెనిఫిట్స్ విషయానికి వస్తే.. కస్టమర్లు 100 SMSల సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అంతేకాదు.. మీరు రీఛార్జ్ చేసిన వెంటనే.. Jio TV, Jio సినిమా, Jio క్లౌడ్ ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. పేటీఎం వంటి యాప్‌ల ద్వారా ఈ రూ. 395 ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకోవచ్చు.