Jio Best Offers : జియో యూజర్లకు పండగే.. 365 రోజుల ప్లాన్ భలే ఉందిగా.. 912GB హైస్పీడ్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్..!
Jio Best Offers : జియో యూజర్లు లాంగ్ టైమ్ కనెక్టివిటీ కోసం ప్రీమియం డిజిటల్ సర్వీసులను పొందవచ్చు. 365 రోజుల పాటు ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండానే ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.

Jio Best Offers
Jio Best Offers : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో 46 కోట్లకు పైగా యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. అందులో ఎక్కువగా లాంగ్ టైమ్ ప్లాన్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.
ఈ ప్లాన్‌లు ఎక్కువ వ్యాలిడిటీతో పాటు మరెన్నో కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తున్నాయి. నెలవారీగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. టెలికాం కంపెనీ అందించే అద్భుతమైన వార్షిక ప్లాన్లలో 365 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్లాన్ అందిస్తోంది.
రూ.3,999 వేలు పెట్టి ఒకసారి రీఛార్జ్ చేస్తే.. దాదాపు 950GB డేటాను ఏడాదంతా పొందవచ్చు. రాబోయే 12 నెలలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్‌లిమిటెడ్ కాల్స్ సహా హైస్పీడ్ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
జియో రూ.3,999 ప్లాన్ :
- 365 రోజుల వ్యాలిడిటీ
- మొత్తం 912.5GB డేటా
- హైస్పీడ్ డేటా రోజుకు 2.5GB ఉంటుంది.
- డేటా లిమిట్ తర్వాత స్పీడ్ తగ్గుతుంది.
- అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
- రోజుకు 100 SMS పొందవచ్చు.
- జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ 90 రోజులు
- ఉచితంగా 50GB (JioAICloud) స్టోరేజీ
జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.. లిమిటెడ్ టైమ్ ఆఫర్ :
జియో నెలవారీ ప్లాన్‌లోని కస్టమర్లు రెండో లేదా 3వ నెల జియోహాట్‌స్టార్ బెనిఫిట్స్ కోసం ప్లాన్ గడువు ముగిసిన 48 గంటలలోపు రీఛార్జ్ చేసుకోవాలి.
ప్లాన్‌తో పాటు ఇతర ఆఫర్లను ఎలా పొందాలి? :
జియో యూజర్లు అదే జియో నంబర్‌తో జియోహాట్‌స్టార్ / జియోఎక్లౌడ్‌లోకి లాగిన్ అవ్వాలి. వార్షిక రీఛార్జ్ ప్లాన్‌తో పాటు తక్కువ వ్యాలిడిటీ గల రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటే.. జియో 200 రోజుల ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లాన్ ధర రూ. 2500 కన్నా తక్కువగా ఉంటుంది.
జియో రూ.2025 ప్లాన్ : అన్‌లిమిటెడ్ కాలింగ్, 500GB 5G డేటా
200 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 2025తో కొత్త జియో ఆఫర్ అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ లాంగ్ టైమ్ 5G ప్లాన్‌లలో ఇదొకటి.
- 200 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్
- రోజుకు 100 ఫ్రీ SMS
- 500GB హై-స్పీడ్ 5G డేటా (రోజుకు 2.5GB)
- రోజువారీ డేటా లిమిట్ తర్వాత అన్‌లిమిటెడ్ లో స్పీడ్ బ్రౌజింగ్
- డేటా ఎక్కువగా వాడే యూజర్లకు బెస్ట్ ప్లాన్
- వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, బ్రౌజింగ్ చేసేవారికి ఈ ప్లాన్ రోజువారీ డేటా పొందవచ్చు.
- రోజుకు 2.5GB డేటా లిమిట్ దాటిన తర్వాత లో స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
అదనపు బెనిఫిట్స్ : JioTV, JioHotstar, AI క్లౌడ్ స్టోరేజ్
- ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో మరెన్నో అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది.
- లేటెస్ట్ మూవీలు, వెబ్ సిరీస్‌ల కోసం జియో హాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్.
- ఫోన్ స్టోరేజ్ కోసం ఫైల్స్, ఫొటోలను స్టోర్ చేసేందుకు 50GB ఏఐ క్లౌడ్ స్టోరేజ్
- లైవ్ టీవీ ఛానెల్స్, స్పెషల్ టీవీ ప్రొగ్రామ్స్ కోసం ఫ్రీ జియో టీవీ సబ్‌స్ర్కిప్షన్