Samsung Galaxy Prices Hike : శాంసంగ్ లవర్స్‌కు బిగ్ షాక్.. ఈ గెలాక్సీ ఫోన్ల ధరలు భారీగా పెంపు.. ఏ మోడల్ ధర ఎంతంటే?
Samsung Galaxy Phones Price Hike : శాంసంగ్ ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ కొత్త ధరలు గెలాక్సీ A17, గెలాక్సీ A27, గెలాక్సీ F17 గెలాక్సీ A07 5G మోడళ్లకు వర్తిస్తాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Samsung Galaxy Prices Hike
- శాంసంగ్ గెలాక్సీ A17 వేరియంట్ల ధరలు రూ. 14వేలకుపైగా పెంపు
- శాంసంగ్ గెలాక్సీ F17 ధరలు రూ. 3,500 మేర పెరగవచ్చు
- శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ధరలో స్వల్ప పెరుగుదల ఉండొచ్చు
Samsung Galaxy Phones Price Hike : శాంసంగ్ లవర్స్‌కు బిగ్ షాక్.. శాంసంగ్ ఇండియా పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను భారీగా పెంచేసింది. ఈ కొత్త ధరలు గెలాక్సీ A17, గెలాక్సీ A27, గెలాక్సీ F17 గెలాక్సీ A07 5G మోడళ్లకు వర్తిస్తాయి. శాంసంగ్ మోడళ్లు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను బట్టి ధరల మార్పులు వేర్వేరుగా ఉన్నాయి.
కొన్ని వేరియంట్లలో ఇతరుల కన్నా భారీ పెంపు కనిపించింది. టీఏ లిస్టులో ఎంపిక చేసిన గెలాక్సీ A17 వేరియంట్లకు ఇదే పెద్ద పెంపు అని చెప్పొచ్చు. లీకైన శాంసంగ్ ధరల ప్రకారం.. కొత్త ధరలు సెప్టెంబర్ 2 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A17 ధర పెంపు :
శాంసంగ్ గెలాక్సీ Xకి సంబంధించిన లీకైన శాంసంగ్ ధరల పెంపు వివరాలను రివీల్ చేసింది. ఈ లిస్టులో మోడళ్లలో శాంసంగ్ గెలాక్సీ A17 ధర అత్యధికంగా పెరిగే అవకాశం ఉంది. టీఏ (ట్రేడ్-ఇన్ అలవెన్స్)తో 6GB + 128GB వేరియంట్ ధర రూ. 19,499 నుంచి రూ. 29,999కి పెరగనున్నాయి. కాగా, 8GB + 128GB, 8GB + 256GB వెర్షన్ల ధరలు వరుసగా రూ. 20,999 నుంచి రూ. 32,999కి, రూ. 23,999 నుంచి రూ. 38,499కి పెరుగుతాయి.
టీఏ లేని శాంసంగ్ గెలాక్సీ A17 వేరియంట్లు కూడా ఖరీదైనవిగా మారొచ్చు. 6GB + 128GB మోడల్ ధర రూ. 24,499 నుంచి రూ. 27,999కి పెరగనున్నట్లు సమాచారం. 8GB + 128GB, 8GB + 256GB వెర్షన్ల ధరలు వరుసగా రూ. 27,499 నుంచి రూ. 30,999కి, రూ. 32,999 నుంచి రూ. 36,499కి పెరగవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A27 మొత్తం 3 కాన్ఫిగరేషన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. 6GB + 128GB మోడల్ ధర రూ. 2వేలు పెరిగి రూ. 33,999కి చేరవచ్చు. కాగా, 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్ల ధరలు వరుసగా రూ. 34,999, రూ. 40,499 నుంచి రూ. 38,999, రూ. 45,499కి పెరగవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F17 ఫోన్ అన్ని వేరియంట్ల ధరలు రూ. 3,500 పెరిగే అవకాశం ఉంది. 4GB + 128GB మోడల్ ధర రూ. 23,499కి, 6GB + 128GB వెర్షన్ ధర రూ. 26,499కి, 8GB + 128GB మోడల్ ధర రూ. 29,499కి చేరుతుంది. చివరగా, శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1,000, రూ. 2,000 స్వల్పంగా పెరిగాయి. ధరలు రూ. 19,999 నుంచి రూ. 22,999 వరకు పెరగవచ్చు.
శాంసంగ్ అధికారిక వెబ్సైట్ ప్రొడక్టు లిస్టులో ఈ కొత్త ధరలు కనిపించలేదు. ఇండస్ట్రీ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శాంసంగ్ ఈ ఏడాది ఇప్పటికే పలు మోడళ్ల ధరలను పెంచగా, ఇతర బ్రాండ్లు కూడా భారీగా పెంచేశాయి. హై-మెమరీ స్పేర్ పార్ట్ ఖర్చులు తయారీదారులపై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. స్పేర్ పార్టుల ఖర్చులలో స్వల్ప పెరుగుదల కూడా బడ్జెట్ ఫోన్ల ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది.
