Samsung Galaxy A36 5G : ఇది కదా డిస్కౌంట్.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ 5G ఫోన్ మరి ఇంత తక్కువా? ఇప్పుడే కొనడం బెటర్..!
Samsung Galaxy A36 5G : శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్ సేల్ సందర్భంగా రూ. 8వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Samsung Galaxy A36 5G
- అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీ భారీ తగ్గింపు
- యాక్సిస్ బ్యాంక్ కార్డుతో రూ. 25,400 వరకు డిస్కౌంట్
- ఈ ఫోన్లో 120Hz అమోల్డ్ డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ
Samsung Galaxy A36 5G : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. ప్రపంచ మార్కెట్లో మెమరీ చిప్ కొరత కారణంగా స్మార్ట్ఫోన్ల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒకవేళ మీరు మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉండదు.
ఎందుకంటే.. రూ. 30వేల లోపు కొత్త ఫోన్లలో అద్భుతమైన ఆఫర్ ఒకటి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A26 5జీ డిస్కౌంట్ ధరకే (Samsung Galaxy A36 5G) లభిస్తోంది. సాధారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 36,499 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ముగియకముందే అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A36ను రూ. 32,999 ధరతో లాంచ్ చేసింది. కానీ, ఈ శాంసంగ్ ఫోన్ ధర పెంపు తర్వాత రూ. 36,499కి లభించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 28,400కే లభిస్తోంది. అంటే.. రూ. 8,099 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారు అదనంగా రూ. 3వేలు తగ్గింపు కూడా పొందవచ్చు. తద్వారా ధర రూ. 25,400కి తగ్గుతుంది.
నెలకు కేవలం రూ. 998 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ రూ. 26,950 వరకు ఎక్స్ఛేంజ్ కూడా చేసుకోవచ్చు. కానీ, ఫైనల్ వాల్యూ మీ ప్రస్తుత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్పైనే ఆధారపడి ఉంటుంది.
Read Also : OnePlus N6 Lite : పండగ చేస్కోండి.. 7,000mAh బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ N6 లైట్ అదుర్స్, ధర జస్ట్ ఎంతంటే?
ఇదే బెస్ట్ టైమ్? :
శాంసంగ్ గెలాక్సీ A36 5జీలో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ లభిస్తుంది. అంతేకాదు.. ఇందులో అడ్రెనో 710 జీపీయూ, 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 6 జనరేషన్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లను కూడా అందిస్తామని హామీ ఇస్తుంది.
డిస్ప్లే విషయానికి వస్తే..
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్ ఉంది. బయట వాడినా ఈ డిస్ప్లే 1,900 నిట్స్ టాప్ బ్రైట్నెస్ చేరుకోగలదని కూడా కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5000mAh బ్యాటరీని అమర్చారు. దీనికి 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP సెన్సార్ కూడా ఉంది.
