Samsung Galaxy F70 Pro : వారెవ్వా.. భలే ఉందిగా ఫోన్.. భారీ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్ వస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Samsung Galaxy F70 Pro : శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్తో రన్ అవుతుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా.
Samsung Galaxy F70 Pro
- శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే
- ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రావొచ్చు
- 6,000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
Samsung Galaxy F70 Pro : శాంసంగ్ లవర్స్ రెడీగా ఉండండి.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో పేరుతో అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు.
రిపోర్టు ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో ఫోన్ SM-E476B/DS మోడల్ నంబర్‌తో బ్లూటూత్ SIG డేటాబేస్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నేషనల్ వేరియంట్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ శాంసంగ్ గెలాక్సీ M47కి దాదాపుగా ఒకేలా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో, ఈ 2 స్మార్ట్ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్సైట్లో లిస్ట్ అయ్యాయి.
స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్తో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా.
Read Also : Tech Tips in Telugu : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఛార్జ్ ఎప్పుడు చేయాలి? బియ్యంలో ఇలా పెట్టారంటే పాడైనట్టే..!
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో ఫోన్ 6,000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా. అయితే, శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లను రివీల్ చేయలేదు.
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ఛాన్స్ ఉంది. రియర్ ప్యానెల్ లెదర్ మాదిరిగా ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్ రేంజ్ కేటగిరీలో అందించవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో ధర సుమారు రూ. 25వేలు ఉండొచ్చు. గత నెలలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ టాప్ బ్రైట్నెస్ లెవల్ 6.7-అంగుళాల sAMOLED డిస్ప్లేతో వస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 6,000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
