Samsung Galaxy Jump 5 : శాంసంగ్ కొత్త బడ్జెట్ బీస్ట్ వచ్చేసింది.. గెలాక్సీ జంప్ 5లో అదిరే AI ఫీచర్లు, ధర జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy Jump 5 : శాంసంగ్ గెలాక్సీ జంప్ 5 ఫోన్ వచ్చేసింది. 50ఎంపీ కెమెరా, 120హెచ్ జెడ్ అమోల్డ్ డిస్ ప్లే, ఏఐ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభమైంది.. ధర ఎంత ఉంటుందో తెలుసా?
Samsung Galaxy Jump 5
- ఈ శాంసంగ్ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్
- 6GB ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్
- భారీ 5,000mAh బ్యాటరీ, జూలై 3 నుంచి ఫస్ట్ సేల్
Samsung Galaxy Jump 5 Launch : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ జంప్ 5 ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్లో HD+ రిజల్యూషన్‌తో సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అందిస్తుంది. కంపెనీ ఇందులో 6GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ అందిస్తుంది. 50MP మెయిన్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్.. శాంసంగ్ గెలాక్సీ జంప్ 5 ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ జంప్ 5 ధర :
సౌత్ కొరియాలో శాంసంగ్ గెలాక్సీ జంప్ 5 లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర KRW 545,600 (సుమారుగా రూ. 33,500) ఉంటుంది. బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ రోజ్ (Samsung Galaxy Jump 5) కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు కేటీ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సేల్స్ జూలై 3వ తేదీన ప్రారంభమవుతాయి.
శాంసంగ్ గెలాక్సీ జంప్ 5 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జంప్ 5 లాంచ్ చేసింది. ఈ ఫోన్లో ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది. ప్రాసెసింగ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ అమర్చారు. 6GB ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. స్టోరేజ్ పెంచుకునేందుకు ఈ ఫోన్లో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.
కెమెరాల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ జంప్ 5లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అందిస్తుంది. 5MP అల్ట్రావైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. థర్డ్ కెమెరా 2MP డెప్త్ సెన్సార్ అందిస్తుంది. ఈ ఫోన్లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ శాంసంగ్ ఫోన్లో భారీ 5,000mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు, వన్ యూఐ 8.5తో వస్తుంది. 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లు అందిస్తుంది. అలాగే, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, యూఎస్బీ-సి పోర్ట్, IP64 రేటింగ్ ఉన్నాయి.
