Samsung Galaxy S25 Ultra 5G : వారెవ్వా కిర్రాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5జీ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ ఫోన్ ఆఫర్ అదిరింది.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కన్నా ముందే ఈ S25 అల్ట్రా 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S25 Ultra 5G
- అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G రూ.1,10,000 ధరతో లభ్యం
- 6.9-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లే , గెలాక్సీ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, క్వాడ్ కెమెరాలు
- రూ.35,950 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, నెలకు రూ.3,969 ఈఎంఐ ఆప్షన్లు
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. పాత శాంసంగ్ 5జీ ఫోన్ పై బిగ్ డిస్కౌంట్.. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్‌కు ముందే ఈ పాత శాంసంగ్ ఫోన్ ధర రూ. 18,599కి తగ్గింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్పెసిఫికేషన్లు, గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, క్వాడ్ కెమెరా, అమోల్డ్ ప్యానెల్, ఎస్ పెన్ ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ శాంసంగ్ ఫోన్ దాదాపు రూ. 1,10,000 ధరలో లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ తగ్గింపు ధరతో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ధర అమెజాన్‌లో రూ.1,12,900కు లిస్ట్ అయింది. లాంచ్ ధర కన్నా రూ.17,099 తక్కువకే పొందవచ్చు. కొన్ని బ్యాంక్ కార్డులతో రూ.1,500 వరకు ఆదా చేసుకోవచ్చు. దాదాపు ఖర్చు రూ.1,10,000కు తగ్గుతుంది. మీరు ఈఎంఐలో నెలకు రూ.3,969 నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
శాంసంగ్ యూజర్లు పాత స్మార్ట్ఫోన్లతో ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.35,950 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, వర్కింగ్ కండిషన్, కొనుగోలు తేదీ, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్స్టెండెడ్ వారంటీ, ఇతర బెనిఫిట్స్ వంటి యాడ్-ఆన్‌లపై అదనంగా చెల్లించాలి.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్ప్లేతో పాటు 1440×3120 పిక్సెల్ షార్ప్ రిజల్యూషన్, అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది.
టాప్-టైర్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కస్టమ్-ట్యూన్ 12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. ఈ ఫోన్ క్వాడ్-కెమెరా సిస్టమ్ 200MP మెయిన్ సెన్సార్‌తో వస్తుంది. ఇందులో 5x ఆప్టికల్ జూమ్ కెపాసిటీతో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 10MP 3x టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా అందిస్తుంది.
