Samsung Galaxy S25 Ultra : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లాంచ్ అయిన వెంటనే పాత మోడల్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇలాంటి డీల్ మళ్లీ రాదు. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీ తగ్గింపుతో లభిస్తోంది.

ఈ అద్భుతమైన డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ కొత్త S26 అల్ట్రా ఫోన్ మార్కెట్లో రిలీజ్ కాగానే ఈ పాత మోడల్ అల్ట్రా ఫోన్ ధర ఒక్కసారిగా తగ్గింది.

కంపెనీ సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు ఎక్కువ సంవత్సరాలు ఆండ్రాయిడ్ వెర్షన్ అప్గ్రేడ్లను అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అదిరిపోయే ఆఫర్ ఎలా పొందాలి? శాంసంగ్ అల్ట్రా ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర తగ్గింపు : ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 1,29,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,08,948 తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.

ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 1,03,948కి తగ్గుతుంది. టైటానియం సిల్వర్‌బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, అడ్రెనో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్ప్లే కూడా ఉంది.

కెమెరాల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ మల్టీ-డైరెక్షనల్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5000mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది.
