Samsung Galaxy S26 Ultra : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ అల్ట్రాపై రూ. 15వేలు డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ రూ. 15వేలు తగ్గింపుతో లభిస్తోంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. కొత్త గెలాక్సీ ఫోన్ ఏఐ ఫీచర్లు, ప్రైవసీ డిస్ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ డివైజ్‌కు ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 వంటి అదనపు స్పెసిఫికేషన్ అప్గ్రేడ్లు ఉన్నాయి.

ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ అయిన కేవలం రెండు నెలలకే రూ. 15వేల కన్నా తక్కువ ధరకు లభిస్తోంది. మీ పాత శాంసంగ్ ఫోన్ అప్‌గ్రేడ్ చేసి కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర ఎంతంటే? : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా బేస్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,39,999 ధరకు లాంచ్ అయింది. అయితే, 512GB, 1TB వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1,50,999 , రూ. 1,80,999గా అందుబాటులో ఉన్నాయి.

కానీ, ఇప్పుడు, అధికారిక స్టోర్లు, విజయ్ సేల్స్‌లో అన్ని వేరియంట్లపై రూ. 9వేలు తగ్గింపుతో లభిస్తోంది. అలాగే, HSBC, HDFC, RBL క్రెడిట్ కార్డ్‌లు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో రూ. 6వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ శాంసంగ్ ఫోన్ నెలకు రూ. 7,127 నుంచి ఈఎఐంతో 24 నెలలకు కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కోసం పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే, ఫోన్ వాల్యూ డివైజ్ వర్కింగ్ కండిషన్ వంటి డిస్కౌంట్ ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కొనాలా? వద్దా? : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ అద్భుతమైన ఏఐ ఫీచర్లతో వస్తుంది. డిస్ప్లే అత్యంత ఆకర్షణీయంగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. 7 ఏళ్ల వరకు సాఫ్ట్వేర్ సపోర్ట్‌తో వన్ యూఐ 8.5 అప్డేట్పై రన్ అవుతుంది.

కొత్త కెమెరా ఐలాండ్, లైట్ డిజైన్ : 5,000mAh బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మాదిరి కెమెరానే ఉంది. మొత్తం మీద ఇదే ధరలో S26 అల్ట్రా ఫోన్ వస్తుంది. మీరు ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా వాడితే S26 అల్ట్రా కొనాల్సిన అవసరం లేదు.
