Samsung Repair Mode : శాంసంగ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. సర్వీసుకు ఇచ్చేముందు మీ డేటాను హైడ్ చేయొచ్చు!

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ రిపేర్ మోడ్ తీసుకొచ్చింది. రిపేర్‌కు ఇచ్చేముందు మీ పర్సనల్ డేటాను హైడ్ చేయొచ్చు.

Samsung Repair Mode : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ రిపేర్ మోడ్ తీసుకొచ్చింది. రిపేర్‌కు ఇచ్చేముందు మీ పర్సనల్ డేటాను హైడ్ చేయొచ్చు. మీ ఫోన్‌ను రిపేర్ కోసం సర్వీస్ సెంటర్‌కి ఇచ్చేముందు ఈ పర్సనల్ డేటాను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. మీ ఫోన్‌‌లోని పర్సనల్ డేటాను తస్కరించే అవకాశం ఉంటుంది. మీ పర్సనల్ ఫొటోలు, డాక్యుమెంట్లు, ఇతర ముఖ్యమైన డేటా బహిర్గతం చేయొచ్చు. మీరు మీ ఫోన్‌ను డేటాను డిలీట్ చేయాల్సి ఉంటుంది. కానీ, మీరు అలా చేయలేకపోతే.. మీ డేటాను ఎవరైనా తస్కరించే రిస్క్ ఉంది. అందుకే శాంసంగ్ ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్‌ తీసుకోస్తోంది.

సామ్ మొబైల్ నివేదిక ప్రకారం.. Samsung రిపేర్ మోడ్ అనే కొత్త ప్రైవసీ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. దీనికి సంబంధించి శాంసంగ్ కొరియన్ వెబ్‌సైట్‌లో వివరణ ఇచ్చింది. రిపేర్ మోడ్ మీ ఫోన్‌ని ఓపెన్ చేసే టెక్నికల్ నిపుణులకు లిమిటెడ్ యాక్సెస్‌ను మాత్రమే అందిస్తుంది. మీరు రిపేర్ మోడ్‌ను ఆన్ చేసిన తర్వాత.. మీ ఫొటోలు, మెసేజ్‌లు, అకౌంట్లు, టెక్నికల్ నిపుణులకు కనిపించకుండా హైడ్ అవుతాయి. కాబట్టి సాంకేతిక నిపుణులు మీ ఫోన్‌ను రిపేర్ చేయడానికి తగినంత యాక్సెస్‌ను పొందుతారు. కానీ, అందుబాటులో ఉన్న కంటెంట్‌ను దుర్వినియోగం చేయలేరు.

Samsung’s Repair Mode Will Hide Your Personal Pictures

నివేదిక ప్రకారం.. Samsung Galaxy S21 సిరీస్‌కు ఫీచర్‌ను రిలీజ్ చేయాలని యోచిస్తోంది. ఇతర డివైజ్‌లను కూడా ఫీచర్‌ను విస్తరించాలని యోచిస్తోంది. అంతర్నిర్మిత సెట్టింగ్‌ల యాప్‌లోని బ్యాటరీ, డివైజ్ ప్రొటెక్షన్ సెక్షన్‌కు వెళ్లడం ద్వారా యూజర్లు రిపేర్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. మీ ఫోన్ రిపేర్ మోడ్‌లోకి వెళ్తుంది. సాంకేతికంగా మీ ఫోటోలు, వ్యక్తిగత డేటాను మీ ఫోన్‌ని ఓపెన్ చేసే సాంకేతిక నిపుణుడికి కనిపించకుండా హైడ్ చేస్తుంది. రిపేర్ చేసే వ్యక్తికి డిఫాల్ట్ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని నివేదిక తెలిపింది. రిపేర్ మోడ్‌ను యూజర్ మాత్రమే ఆన్ చేయవచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను శాంసంగ్ ఇంకా ధృవీకరించలేదు. స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఈ ఫీచర్ ఏయే దేశాలలో రిలీజ్ చేస్తుందో ఏ శాంసంగ్ మోడల్‌లకు అందుబాటులోకి వస్తాయో వెల్లడించలేదు.

Read Also :  Samsung Galaxy M13 Series : శాంసంగ్ గెలాక్సీ M13 5G సిరీస్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు