Gold Rate : మళ్లీ బంగారం ప్రియులకు బిగ్ షాక్..! తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold And Silver Price : ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు గత వారంరోజులుగా తగ్గుతూ వచ్చాయి. దీంతో బంగారం కొనుగోలుదారులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే, గోల్డ్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో మళ్లీ బంగారం ధరల పెరుగుదల షురూ అయింది. ఈనెల 26న (శుక్రవారం) 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 440 పెరిగింది. తాజాగా శనివారంకూడా బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్లపై రూ. 220 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే గోల్డ్ రేటు రూ.660 పెరిగినట్లయింది. మరోవైపు వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో పది రోజుల్లో కిలో వెండిపై రూ. 2500 తగ్గింది.

 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,930 వద్దకు చేరింది.

 

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,080.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,850 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,930.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,760.

 

తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.87,500 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 87,500. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.84,000 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.

 

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు