కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి బంపర్ బొనాంజా..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 55% డీఏ పొందుతున్నారు. ద్రవ్యోల్బణం దృష్ట్యా మరో 3% పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Salary Boost: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 8వ వేతన కమిషన్ గురించి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. దానికి కాస్త సమయం పట్టవచ్చు. అయితే, దీపావళి ముందు వారికి ఓ గుడ్‌న్యూస్ రానుంది.
డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ప్రకటన దీపావళికి ముందు వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల 1.2 కోట్లకు పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులు లాభపడతారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 55% డీఏ పొందుతున్నారు. ద్రవ్యోల్బణం దృష్ట్యా మరో 3% పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: వావ్.. వందే భారత్ స్లీపర్.. కోచ్ లు అదిరిపోయాయ్.. ఫీచర్లు ఇంకా..
ఈ భత్యాన్ని సంవత్సరంలో రెండుసార్లు సవరిస్తారు. జనవరి, జూలై నుంచి అమలులోకి వస్తుంది. ఈ సారి జూలైలో పెంపు 3-4% మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ప్రకటనలు ఫిబ్రవరి-మార్చి లేదా సెప్టెంబర్-అక్టోబర్‌లో వచ్చినా, పెంపు మాత్రం జనవరి, జూలై నుంచే వర్తిస్తుంది.
దీని వల్ల ఉద్యోగులు, పింఛన్ పొందుతున్నవారు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఉపశమనం పొందుతారు. ఈ సవరణలు కార్మిక బ్యూరో నెలవారీగా రూపొందించే ఇండస్ట్రియల్ వర్కర్స్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా ఉంటుంది.
బేసిక్ శాలరీ రూ.18,000 ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం 53% డీఏ ప్రకారం రూ 9,990 పొందుతున్నారు. డీఏ 3% పెరిగితే, ఉద్యోగి భత్యం రూ.10,440 అవుతుంది. నెలకు అదనంగా రూ.540 పెరుగుతుంది. (Salary Boost)