Gold Price decreased : హమ్మయ్య.. బంగారం, వెండి ధరలు తగ్గాయ్.. హైదరాబాద్‌లో తులం గోల్డ్‌పై ఎంత తగ్గిందంటే?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. (Gold Price decreased)

Gold Price decreased
Gold Price decreased : గత రెండు వారాలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్న బంగారం ధర దూకుడుకు బ్రేక్ పడింది. సోమవారం గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది (Gold Price decreased).
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 110 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. ఔన్సు గోల్డ్ పై ఒక డాలర్ తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,586 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.99,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,08,380కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,500 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,08,510కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.99,350 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,08,380కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,37,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,37,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.