Best Investment Advice : మీ పిల్లల భవిష్యత్తు కోసం నెలకు రూ. 5వేలతో పెట్టుబడి.. ఎన్ని ఏళ్లలో ఎంత రాబడి వస్తుందంటే?
Best Investment Advice : మీ పిల్లల వయస్సు 3ఏళ్లు ఉంటే వారి భవిష్యత్తు కోసం ముందు నుంచే నెలకు రూ. 5వేలు చొప్పున పెట్టుబడి పెట్టండి.

Best Investment Advice
Best Investment Advice : పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అది కూడా మీ పిల్లల కోసం ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుత రోజుల్లో ఎంత సంపాదించినా కొద్ది మొత్తంలోనైనా పెట్టుబడి పెట్టాలని అంటుంటారు.
అయితే, కొద్ది మంది మాత్రమే పెట్టుబడుల వైపు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు ఆ సంపాదించిన మొత్తాన్ని ఖర్చులతోనే గడిపేస్తుంటారు. ఇప్పుడు ఎంతగా సంపాదన ఉన్నా సరే భవిష్యత్తు కోసం ఎంతో కొంత దాచుకోవాలి.
పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం :
లేదంటే.. పిల్లల భవిష్యత్తు అవసరాలు ఎప్పటికీ తీరవు. మీ పిల్లలు వయస్సు 3 ఏళ్ల లోపు నుంచి వారిపై కొద్దిమొత్తంలోనైనా పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించాలి. నెలకు రూ. 5వేలు చొప్పున పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు.
మీరు ఇప్పటివరకూ ఎలాంటి పెట్టుబడి పెట్టకపోతే ఇప్పుడే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. పిల్లల భవిష్యత్తు అవసరాలకు ముందునుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పిల్లలకు ఆర్థికంగా రక్షణ కల్పించాల్సిన అవసరం తల్లిదండ్రులపైనే ఉంటుంది.
నెలకు రూ. 5వేల నుంచి పెట్టుబడి :
మీ ఫ్యామిలీలో ఎవరైనా సంపాదించే వ్యక్తులు ఉంటే వెంటనే వారి పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం బెటర్. అలాగే, విద్యా ద్రవ్యోల్భణం దాదాపు 10 శాతం వరకూ ఉంటుంది. అందుకే మీరు పెట్టుబడి పెట్టే మొత్తం కూడా దీనికి మించి ఉండేలా చూసుకోవాలి. పెట్టుబడి పెట్టాలనుకునే మొత్తాన్ని ముందుగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో సేవింగ్ చేయడం మంచిది. అంటే.. నెలకు రూ. 5వేలు చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లండి.
సగటు వార్షిక రాబడి 12 శాతం అంచనాతో 15ఏళ్ల వరకు పెట్టుబడిని కొనసాగించండి. అప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై వచ్చే రాబడి రూ. 22,36,782 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం మీ పిల్లల భవిష్యత్తు చదువులకు అప్పటి అవసరాలకు తగినట్టుగా ఉండకపోవచ్చు.
అందుకే మీరు నెలకు పెట్టుబడి పెట్టే మొత్తంలో వీలైంతన వరకు ఎక్కువగా మొత్తంలో పెట్టుబడిని పెంచుకుంటూ పోతుండాలి. అప్పుడే భవిష్యత్తు అవసరాలకు తగినంత ఆర్థిక స్థోమత ఏర్పడుతుంది.