Top 5 Upcoming Smartphones : ఐఫోన్‌కు గట్టి పోటీ.. బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు.. ఆగస్టులో రానున్న టాప్ 5 స్మార్ట్ఫోన్లు మిస్ కావొద్దు!
Top 5 Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అదిరిపోయే ఫీచర్లతో ఈ ఆగస్టులో టాప్ 5 స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి. గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ నుంచి వివో వి80 వరకు ఫోన్లు ఉండనున్నాయి.. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
Top 5 Upcoming Smartphones
- కొత్త స్మార్ట్‌ఫోన్ ప్లాన్‌లో ఉన్నారా? ఆగస్టులో రాబోయే కిర్రాక్ ఫోన్లు
- పవర్ఫుల్ ప్రాసెసర్.. సూపర్ కెమెరాతో అద్భుతమైన ఫీచర్లు
- గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ నుంచి వివో వి80 వరకు ఫోన్లు
Top 5 Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే ఆగస్టులో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఇప్పటికే మొబైల్ తయారీ కంపెనీలు కొత్త ఫోన్ల లాంచ్‌కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశాయి.
ఈ నెలలో అనేక బ్రాండ్ల ఫోన్లు లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. కొత్త జనరేషన్ టెన్సర్ చిప్సెట్, అప్‌గ్రేడ్ ఏఐ ఫీచర్లు, బ్యాక్ సైడ్ పిక్సెల్ గ్లో ఎల్ఈడీతో మెరుగైన కెమెరా సెటప్ అందించే గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించనుంది.
వివో నుంచి ఐక్యూ వంటి మరిన్ని కొత్త మిడ్-రేంజ్ ఫోన్లు కూడా రానున్నాయి. పోకో సరసమైన ధరలో పోకో M8 పవర్ 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 2026లో లాంచ్ కానున్న టాప్ 5 స్మార్ట్ఫోన్లకు సంబంధించి పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
1. గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ :
లాంచ్ తేదీ : ఆగస్టు 12, 2026
ఆగష్టు 12న జరిగే ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్లో గూగుల్ రాబోయే పిక్సెల్ 11 సిరీస్‌ను ఆవిష్కరించనుంది. అదే రోజు ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమవుతాయని ధృవీకరించింది. గత ఏడాది మాదిరిగానే ఈ లైనప్‌లో గూగుల్ 4 కొత్త ఫోన్లను ప్రకటించనుంది. అందులో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఫోన్లు ఉండనున్నాయి.
అన్ని పిక్సెల్ 11 సిరీస్ ఫోన్లు 2nm ప్రాసెస్‌తో కొత్త టెన్సర్ జీ6 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. ఈ ఏడాదిలో 128జీబీ మోడల్ ఉండే ఛాన్స్ లేదు. ఈ ఫోన్లు 256జీబీ బేస్ స్టోరేజ్‌తో వస్తాయి. ఈ ఫోన్లు అప్‌గ్రేడ్ కెమెరా హార్డ్‌వేర్, మెరుగైన కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీని అందిస్తాయి.
పిక్సెల్ 11 సిరీస్‌లో అప్‌గ్రేడ్ జెమిని ఏఐతో పాటు మరిన్ని ఫీచర్లు చూడొచ్చు. బ్యాక్ కెమెరా బార్లో ‘పిక్సెల్ గ్లో’ ఎల్ఈడీ మరో అదనపు ఫీచర్ అందిస్తుంది. మల్టీ కలర్ ఆప్షన్లలో నథింగ్ ఫోన్లలో గ్లిఫ్ ఇంటర్ఫేస్ మాదిరిగానే ఇన్కమింగ్ అలర్ట్ కోసం మైక్రో లైటింగ్ ఫ్లాష్ ఉంటుందని అంచనా.
ధర (అంచనా) :
స్టాండర్డ్ పిక్సెల్ 11 ప్రారంభ ధర 899 డాలర్లు (సుమారు రూ. 87వేలు) ఉంటుందని పుకార్లు ఉన్నాయి. పిక్సెల్ 11 ప్రో ధర 1099 డాలర్లు (సుమారు రూ. 1.05 లక్షలు) నుంచి ప్రారంభం కావచ్చు. అయితే పిక్సెల్ 11 ప్రో XL ధర 1299 డాలర్లు (సుమారు రూ. 1.25 లక్షలు) నుంచి లాంచ్ కావచ్చు. పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ధర 1899 డాలర్లు (సుమారు రూ. 1.82 లక్షలు) నుంచి ఉంటుందని అంచనా.
2. ఐక్యూ జెడ్11 ఫోన్ :
లాంచ్ : ఆగస్టు 2026 (అంచనా)
ఐక్యూ లైనప్‌లో మూడో ఫోన్‌గా ఐక్యూ జెడ్11ను భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇంకా అధికారిక లాంచ్ తేదీ ప్రకటించలేదు. వచ్చే ఆగస్టులో ఈ ఐక్యూ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ, ఇప్పటికే చైనాలో ఐక్యూ జెడ్11 లాంచ్ అయింది. కానీ, భారతీయ వేరియంట్లో వేరే హార్డ్‌వేర్ ఉంటుంది. చైనా మోడల్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌తో వస్తుంది. భారతీయ మోడల్లో డైమెన్సిటీ 7500 ప్రాసెసర్ ఉంటుంది.
భారత మార్కెట్లో రాబోయే ఈ హ్యాండ్సెట్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో రానుంది. ఇతర స్పెసిఫికేషన్లు ఒకేలా ఉండొచ్చు. ఐక్యూ జెడ్11 (ఇండియన్ మోడల్)లో 6.83-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9020mAh బ్యాటరీ, స్ట్రాంగ్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండొచ్చు. ఇందులో 50MP సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ స్నాపర్ ఉండొచ్చు.
ధర (అంచనా) :
ఐక్యూ జెడ్11 బేస్ వేరియంట్ ధర రూ. 30వేలు (సుమారు 315 డాలర్ల ) లోపు ఉంటుందని అంచనా.
3. వివో V80 సిరీస్ :
లాంచ్ : ఆగస్టు 2026 (అంచనా)
కెమెరా ఫీచర్ల పరంగా వివో వి80 సిరీస్ అద్భుతమైన హార్డ్‌వేర్, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఆగస్టులో రానుంది. ఇటీవలి లీక్‌ల ప్రకారం.. స్టాండర్డ్ V80లో 1.5K రిజల్యూషన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ గత మోడల్లోని స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్తో వస్తుంది. అయితే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7200mAh బ్యాటరీతో వస్తుందని అంచనా.
వివో V80లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. సెల్ఫీ కెమెరా 50MP రిజల్యూషన్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్, ఐపీ69 రేటింగ్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా.
ధర (అంచనా) :
8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వివో V80 బేస్ మోడల్ ధర సుమారుగా ధర రూ. 60వేలు (దాదాపు 630 డాలర్లు) ఉండవచ్చని అంచనా.
4. పోకో M8 పవర్ 5G ఫోన్ :
లాంచ్ : ఆగస్టు 4, 2026
బడ్జెట్ పోకో M8 పవర్ 5జీ ఫోన్ ఆగస్టు ఫస్ట్ వారంలో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫస్ట్ సేల్ అధికారికంగా వెల్లడించింది. ఈ పోకో ఫోన్ 8000mAh బ్యాటరీ, అమోల్డ్ స్క్రీన్, బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ఉంటాయని అధికారిక టీజర్లు తెలిపాయి.
పోకో M8 పవర్ 5జీ ఫోన్ కోసం ఆరెంజ్ కలర్ ఆప్షన్‌ను కూడా పోకో రివీల్ చేసింది. మిగిలిన స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ డివైజ్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 7.0-అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్, IP65 రేటింగ్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండొచ్చు.
ధర (అంచనా):
పోకో M8 పవర్ 5జీ ఫోన్ సరసమైన ధరకే రానుంది. ఈ పోకో ఫోన్ ధరలు రూ. 20వేలు (సుమారు 200 డాలర్లు) లోపు ఉండవచ్చు.
5. వివో S2 ఫోన్ :
లాంచ్ : ఆగస్టు 2026 (అంచనా)
వివో ఇండియా S-సిరీస్ మళ్లీ తీసుకొస్తోంది. ఈ సిరీస్‌లోని లాస్ట్ ఫోన్ వివో S1 మోడల్ కాగా, 7 ఏళ్ల క్రితమే లాంచ్ అయింది. త్వరలో నెక్ట్స్ ఫోన్, వివో S2 కూడా రాబోతోంది. కంపెనీ ఇంకా లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. అమెజాన్‌లో మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ అయింది.
కొన్ని లీక్‌ల ప్రకారం.. ఈ వివో ఫోన్‌ను ఆగస్టు 6న లాంచ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ సేల్ ఆగస్టు 11న ప్రారంభం కానుంది. వివో S2లో 6.59-అంగుళాల అమోలెడ్ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్‌లో 32MP కెమెరా ఉంటుందని అంచనా.
అంచనా ధర :
వివో S2 ఫోన్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38వేలు (సుమారు 400 డాలర్లు)గా 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43వేలు (సుమారు 500 డాలర్లు)గా ఉండవచ్చని అంచనా.
