Upcoming Smartphones : 10,000mAh బ్యాటరీతో దుమ్మురేపనున్న కొత్త స్మార్ట్ఫోన్లు.. రెడ్మి నుంచి పోకో వరకు భారీ లైనప్!
Upcoming Smartphones : 10,000mAh భారీ బ్యాటరీతో రెడ్మి నోట్ 17 ప్రో మ్యాక్స్, ఒప్పో F35 ప్రో, వివో V80 లైట్ 5జీ, పోకో X8 పవర్ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు, కెమెరా, డిస్ప్లే వివరాలు తెలుసుకోండి.
Upcoming Smartphones in September 2026
- వచ్చే సెప్టెంబర్‌లో రానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే
- వివో V80 లైట్ 5G సెప్టెంబర్ 3న లాంచ్ కానుంది
- పోకో X8 పవర్లో 50MP మెయిన్ కెమెరా ఉండొచ్చు
- ఒప్పో F35 ప్రో త్వరలో మార్కెట్లోకి రావచ్చు
Upcoming Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీకోసం వచ్చే సెప్టెంబర్ నెలలో అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ అంటే ఇప్పుడు కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే కాదు.. మెసేజ్‌లు, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, ఫొటోలు తీయడం, ఆన్లైన్ మీటింగ్స్‌లో జాయిన్ అవ్వడం, డిజిటల్ పేమెంట్స్ చేయడం వరకు దాదాపు ప్రతిపనికీ స్మార్ట్ ఫోన్‌పైనే డిఫెండ్ అవుతున్నాం.
అందుకే బ్యాటరీ లైఫ్‌పై ఎక్కువగా ఆలోచిస్తుంటాం.. మీరు కూడా మంచి బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ల కోసం చూస్తుంటే.. 10,000mAh బ్యాటరీతో రాబోయే కొన్ని కొత్త స్మార్ట్ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీ ఫేవరెట్ బ్రాండ్ ఏది ఉందో చెక్ చేసుకోండి.
రెడ్మి నోట్ 17 ప్రో మ్యాక్స్ :
ఆగస్టు 27న గ్లోబల్ మార్కెట్లోకి ఈ ఫోన్ రానుంది. 6.8-అంగుళాల 120Hz ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్సెట్ ఇందులో ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా 10,000mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. 50MP మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉండనున్నాయని సమాచారం. 4 మెయిన్ ఆండ్రాయిడ్ OS అప్డేట్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లు అందించనుంది.
ఒప్పో F35 ప్రో :
ఒప్పో F35 ప్రో ఆగస్టు చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని రిపోర్టు పేర్కొంది. 1.5K LTPS అమోల్డ్ ఫ్లాట్ డిస్ప్లే, 50MP మెయిన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్సెట్ ఇందులో ఉండవచ్చని అంచనా. 10,000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందస్తుంది.
వివో V80 లైట్ 5G :
సెప్టెంబర్ 3న వివో V80 లైట్ 5జీ లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్లో 10,000mAh బ్యాటరీ మెయిన్ అట్రాక్షన్. 50MP మెయిన్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్, 6GB ర్యామ్ వేరియంట్ ఉండవచ్చని బెంచ్‌మార్క్ లిస్టింగ్ సూచిస్తోంది. గ్రీన్, రోజ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.
పోకో X8 పవర్ :
పోకో X8 పవర్లో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్ ఉండవచ్చని సమాచారం. గొర్రిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా ఉండొచ్చు. 50MP మెయిన్ కెమెరాకు 8MP సెకండరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని అంచనా. 10,000mAh బ్యాటరీతో పాటు IP68, IP69 రేటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఫైనల్‌గా చూస్తే ఈ అన్ని ఫోన్లలో భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అదిరే డిస్ప్లేలు, మంచి కెమెరాలతో కంపెనీలు అందిస్తున్నాయి. అయితే, ఇందులో కొన్ని ఫోన్ల స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఫైనల్ ఫీచర్లు, ధరలపై లాంచ్ సమయంలోనే క్లారిటీ రానుంది.
