UPI Payment Complaint : యూపీఐ రాంగ్ పేమెంట్ చేశారా? డోంట్ వర్రీ.. ఇలా చేశారంటే మీ డబ్బులు క్షణాల్లో తిరిగొస్తాయి.. ఫుల్ డిటెయిల్స్
UPI Payment Complaint Number: రాంగ్ నెంబర్ కు యూపీఐ పేమెంట్ చేశారా? వెంటనే NPCI టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఇంకా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
UPI Payment Complaint Number
UPI Payment Complaint Number : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. యూపీఐ పేమెంట్లు చేసేటప్పుడు జాగ్రత్త.. మీరు తప్పుగా యూపీఐ పేమెంట్ చేస్తే అంతే సంగతులు. మీరు డబ్బు పంపిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అందుకు యూపీఐ పేమెంట్ చేసే సమయంలో తొందరపడొద్దు. డబ్బును పంపే ముందు ఎవరికి ఎంత డబ్బును పంపుతున్నామో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతే యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేదంటే మీరు ఏదైనా రాంగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ డబ్బులు అవతల వ్యక్తికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత డబ్బును రికవరీ చేసుకోవడం చాలా కష్టం.
ఒకవేళ మీకు ఇలాంటి అనుభవమే ఎదురైతే.. అసలు ఆందోళన పడొద్దు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి కేసులను ఈజీగా పరిష్కరించవచ్చు. ఒకసారి యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయడం కుదరదు.
మీరు పొరపాటున ఎవరికైనా డబ్బు పంపితే మీరు ఆ డబ్బు పొందిన వారిని సంప్రదించి రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. అందుకు వారు అంగీకరించకపోతే మీరు NPCIకి కంప్లయింట్ చేయొచ్చు.
ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి :
మీరు NPCI టోల్-ఫ్రీ నంబర్ (1800-120-1740)కు కాల్ చేసి కంప్లయింట్ చేయవచ్చు. మీ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి అవసరమైన ఫారమ్‌ను నింపాలి. రాతపూర్వకంగా ఫిర్యాదును కూడా సమర్పించవచ్చు. ఒకవేళ బ్యాంక్ మీకు హెల్ప్ చేసేందుకు నిరాకరించినా లేదా చర్య తీసుకోవడం ఆలస్యం చేసినా మీరు (https://rbi.org.in/Home.aspx)లో బ్యాంకుపై ఫిర్యాదు చేయవచ్చు.
ట్రాన్సాక్షన్ నెంబర్ దగ్గర పెట్టుకోండి :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ పొరపాటున వేరొకరి అకౌంట్లోకి వెళ్తే బ్యాంక్ ఆ ఫిర్యాదును రివ్యూ చేసి 48 గంటలలోపు రీఫండ్ ప్రాసెస్ చేయాలి.
మీరు UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేశాక డబ్బు కట్ అయిందని మెసేజ్ వస్తే జాగ్రత్తగా ఉండండి. అందులో ట్రాన్సాక్షన్, PPBL నంబర్ ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు ఈ నంబర్ తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది.
