Valentine Day Sale : వాలెంటైన్స్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ. 24వేలు డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
Valentine Day Sale : వాలెంటైన్స్ డే సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీగా తగ్గింది. బెస్ట్ ఆఫర్లతో రూ. 24వేల లోపు తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Valentine Day Sale : ఆపిల్ లవర్స్ పండగ చేస్కోండి. వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అందులో ఐఫోన్ 15, 256GB మోడల్ ధర భారీగా తగ్గింది. 2024లో ఈ ఐఫోన్ లాంచ్ కాగా ప్రస్తుత రిలయన్స్ డిజిటల్ సేల్ సమయంలో రూ. 24వేలు డిస్కౌంట్తో కొనేసుకోవచ్చు. ఐఫోన్ 15 కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఐఫోన్ 15 ధర భారీ తగ్గింపు : ఈ ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ మొత్తం 3 స్టోరేజీ (128GB, 256GB, 512GB) ఆప్షన్లతో లభిస్తోంది. 128GB వేరియంట్ ఇప్పుడు రూ. 24వేలు తక్కువ ధరకు లభిస్తుంది. రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ లాంచ్ ధర రూ. 79,900 ఉండగా రిలయన్స్ డిజిటల్ రూ. 55,900 ప్రారంభ ధరతో అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఇదే ఐఫోన్ 15 మోడల్ ధర రూ. 52,900 కొనేసుకోవచ్చు.

ఈ ఐఫోన్ 15 256GB మోడల్ ప్రారంభ ధర రూ. 89,900 ఉండగా ఇప్పుడు ధర తగ్గింపుతో రూ. 69,900కు లభిస్తోంది. అదనంగా రూ. 4వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో మొత్తం ఐఫోన్ 15 మోడల్ 256GB స్టోరేజీ ధర రూ. 65,900కు సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 15 ఫీచర్లు ఈ ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ డిస్ప్లేతో వస్తుంది. డైనమిక్ ఐలాండ్ డిస్ప్లే స్క్రీన్ ఫీచర్లలో A16 బయోనిక్ చిప్సెట్ పవర్ అందిస్తుంది. 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తుంది.

ఈ ఐఫోన్లో శాటిలైట్ కనెక్టివిటీ, యాక్సిడెంట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు ఆపరేటింగ్ సిస్టమ్ iOS 17, iOS26కి అప్ డేట్ చేసుకోవచ్చు. ఐఫోన్ 15 బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉన్నాయి.

ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ఐఫోన్ 15లో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
