Vivo T4 Lite 5G : వాలెంటైన్స్ డే సేల్‌లో ఈ వివో 5G ఫోన్ జస్ట్ రూ. 9,977కే, ఫీచర్లు మాత్రం కేక.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు
Vivo T4 Lite 5G : వివో టీ4 లైట్ 5జీ ఫోన్ భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌లో ఈ ఖతర్నాక్ ఫోన్ కేవలం రూ. 9,977కే సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే?

Vivo T4 Lite 5G : వివో ఫోన్ ఆఫర్ అదిరింది. మీరు వివో ఫ్యాన్ అయితే ఇది మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌లో వివో T4 లైట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ సేల్ సమయంలో కేవలం రూ. 9,977కే లభిస్తోంది. ఈ వివో ఫోన్ పవర్ఫుల్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్సెట్తో వస్తుంది.

50MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ కూడా అందిస్తుంది. హై స్టోరేజీతో 6000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ కూడా పొందుతుంది. వివో T4 లైట్ 5జీ ఫోన్ ఫీచర్లు, ధర తగ్గింపుతో మరిన్ని డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి..

ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌లో ధర, మరిన్ని డిస్కౌంట్లు : భారత మార్కెట్లో వివో T4 లైట్ 5జీ ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999కి లాంచ్ అయింది. కానీ, 15శాతం తగ్గింపుతో ధర రూ. 10,999కి మారింది.

అంతేకాదు, మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే.. రూ. 1,022 ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 9,977కి సొంతం చేసుకోవచ్చు.

మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే.. రూ. 500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఒకేసారి మొత్తం పేమెంట్ చేయలేకపోతే మీరు ఫోన్‌ను ఈఎంఐ ఆప్షన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ. 509 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ మొత్తాన్ని 24 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది.

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ : వివో T4 లైట్ 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP మెయిన్ సెన్సార్, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP బోకె లెన్స్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 5MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 6000mAh హై బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

డిస్ప్లే, డిజైన్ : వివో T4 లైట్ 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.74-అంగుళాల HD+ LCD స్క్రీన్ అందిస్తుంది. 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. TÜV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ పొందుతుంది. ఈ ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ అందిస్తుంది.

మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H మన్నికతో SGS 5-స్టార్ యాంటీ-ఫాల్ సర్టిఫికేషన్ పొందుతుంది. ఈ ఫోన్లో 200శాతం వాల్యూమ్ బూస్ట్ ఫీచర్‌తో సింగిల్ స్పీకర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందిస్తుంది.

పర్ఫార్మెన్స్ : వివో T4 లైట్ 5జీ ఫోన్ 6nm ప్రాసెస్‌పై ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 5జీ చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ ఫన్‌టచ్ OS15తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.

వివో 2 ఏళ్ల ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది. ఈ వివో ఫోన్ రోజువారీ వినియోగం, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. వివో లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్.
