Vivo V60e 5G : వివో ఫ్యాన్స్ మీకోసమే.. 200MP కెమెరాతో వివో 5Gపై బిగ్ డిస్కౌంట్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?
Vivo V60e 5G : వివో ఫోన్ ఆఫర్ అదిరింది.. వివో V60e ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుుడు చూద్దాం..

Vivo V60e 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్.. వివో V60e 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. 200MP కెమెరాతో వివో 5జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అమెజాన్ ఇండియా నుంచి ఈ ఖతర్నాక్ డీల్ పొందవచ్చు.

ఈ వివో V60e 5జీ ఫోన్ రూ. 30వేల కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. పవర్ఫుల్ బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. వివో ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో V60e ధర ఎంతంటే? : 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999కు లభిస్తోంది. అమెజాన్ నుంచి 14శాతం తగ్గింపుతో రూ.29,999కు కొనుగోలు చేయవచ్చు. అయితే, బ్యాంక్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించవచ్చు.

వివో V60e బ్యాంకు ఆఫర్లు : బ్యాంక్ ఆఫర్ల కింద కస్టమర్లకు యాక్సిస్, ఐసీఐసీఐ, కోటక్ క్రెడిట్ కార్డులపై రూ. 1500 తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ కోసం రూ. 28,499 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ. 1055 ఈఎంఐ ఆప్షన్‌పై కూడా కొనుగోలు చేయొచ్చు.

వివో V60e స్పెసిఫికేషన్లు : ఈ వివో ఫోన్ 6.77-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2392×1080 పిక్సెల్ రిజల్యూషన్ అందిస్తుంది. 1900 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం డైమండ్ షీల్డ్ గ్లాస్ అందిస్తుంది. 12GB LPDDR4x ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. డైమెన్సిటీ 7360 చిప్సెట్తో ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15పై రన్ అవుతుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 200MP మెయిన్ OIS కెమెరా 8MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం 50MP కెమెరాతో వస్తుంది. ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. IP68 + IP69 రేటింగ్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
