Vivo V70 Series : వివోనా మజాకా.. కొత్త వివో V70 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo V70 Series : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. వివో V70 సిరీస్ ఫిబ్రవరి 19న లాంచ్ కానుంది. వివో V70, వివో V70 ఎలైట్ ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
Vivo V70 Series
- వివో V70, వివో V70 ఎలైట్ ఫిబ్రవరి 19న లాంచ్ అయ్యే ఛాన్స్
- ఫిబ్రవరి 24 నుంచి వివో V70 సిరీస్ ఫస్ట్ సేల్ ప్రారంభం
- ధర రూ. 50వేలు, రూ. 55వేల మధ్య ఉంటుందని అంచనా
Vivo V70 Series : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో కొత్త V70 సిరీస్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో వివో V70, వివో V70 ఎలైట్ పేరుతో మొత్తం 2 స్మార్ట్ఫోన్లు రానున్నాయి. కంపెనీ ఈ ఫోన్లకు సంబంధించి లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.
కానీ, లాంచ్ తేదీ ముందుగానే లీక్ అయింది. ఈ లీక్ ప్రకారం వివో V70 సిరీస్ ఫిబ్రవరి 19న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, ఫిబ్రవరి 24 నుంచి ఫస్ట్ సేల్ కూడా మొదలువుతుందని లీక్ పేర్కొంది.
ధర (అంచనా) :
టిప్‌స్టర్ ప్రకారం.. వివో V70 ఎలైట్ సిరీస్ ధర రూ. 50వేలు నుంచి రూ. 55వేల మధ్య ఉంటుందని అంచనా. భారత మార్కెట్లలో “ఎలైట్” అనే పేరుతో వివో ఇంకా ఏ ఫోన్లను లాంచ్ చేయలేదు. వివో V70 ప్రో, వివో V70 ఎలైట్ కూడా ఉంటుందా? లేదా అనేది క్లారిటీ లేదు. అయితే, వివో V70 సిరీస్ లాంచ్ తేదీపై కూడా అధికారిక ప్రకటన రాలేదు.

Vivo V70 Series
క్వాల్కమ్ ప్రాసెసర్లతో కొత్త వివో V70 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. వెనిల్లా మోడల్ వివో వి70 ఫోన్ 2.8GHz వరకు 4nm, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గత ఏడాదిలో వివో V60 కూడా స్నాప్ డ్రాగన్ జెన్ 4పై రన్ అవుతుంది. వివో V70 ఎలైట్ 3.0GHz వరకు 4nm స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రానుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. వివో V70 5జీ ఫోన్ 6.59-అంగుళాల 1.5K డిస్ప్లేతో వస్తుంది. 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫ్లాట్ అమోల్డ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4320Hz PWM డిమ్మింగ్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో HDR10+కి సపోర్టు ఇస్తుంది. ఈ రాబోయే వివో స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ టెక్నాలజీతో వస్తుంది. IP68 + IP69 రేటింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
Get ready for the most evolved V Series yet. With elegant colours and a refined design made for everyday moments, that unfold without planning. ✨
Powered by ZEISS imaging, Sony sensors and Qualcomm performance, the V70 Series is built to capture celebrations like never before!… pic.twitter.com/k0ejbX5Rb1
— vivo India (@Vivo_India) January 30, 2026
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. :
వివో V70 సిరీస్‌లో జైస్ లెన్స్‌లు ఉన్నాయి. కొత్త వివో V70 సిరీస్ స్మార్ట్ఫోన్లు 50MP సెల్ఫీ సెన్సార్‌తో వస్తుంది. వివో V70 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP మెయిన్ సోనీ OIS సెన్సార్, ఎఫ్/1.88 ఎపర్చరు, ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మూడో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
పవర్ బ్యాకప్ విషయానికి వస్తే.. :
వివో V70 5జీ ఫోన్ 6500mAh బ్యాటరీతో రానుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్‌పై 40 గంటల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. భారీ బ్యాటరీ వేగంగా ఛార్జ్ చేయొచ్చు. 90W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. బ్యాటరీకి బదులుగా మదర్‌బోర్డ్‌కు నేరుగా కరెంట్‌ను సప్లయ్ చేస్తుంది.
