Vivo V70 Lite Launch : కొత్త వివో ఫోన్ సెన్సేషన్ .. వివో V70 లైట్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్..
Vivo V70 Lite Launch : వివో నుంచి సరికొత్త వివో వి70 లైట్ వచ్చేసింది. 6500mAh బ్యాటరీ, 8జీబీ ర్యామ్, 50ఎంపీ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
Vivo V70 Lite Launched
- ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్సెట్
- భారీ 6500mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
- 32MP ఫ్రంట్ కెమెరా, 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్
Vivo V70 Lite Launch : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. వివో నుంచి సరికొత్త ఫోన్ వివో V70 లైట్ వచ్చేసింది. కంపెనీ చాలా సైలంట్‌గా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లో 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంది.
ఇందులో సోనీ IMX882 సెన్సార్ అమర్చారు. ఈ ఫోన్లో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రాసెసింగ్ కోసం (Vivo V70 Lite Launch) మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్సెట్ ఉపయోగించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఆరిజిన్ OS6 స్కిన్ అమర్చారు. ఈ ఫోన్ ధర, ఇతర ప్రత్యేక ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వివో V70 లైట్ ధర ఎంతంటే? :
వివో V60 లైట్ ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర AED 1,099 (సుమారుగా రూ. 28,500)కు లభిస్తుంది. 8GB+256GB వేరియంట్ ధర AED 1,299 (సుమారుగా రూ. 33,500)కు లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో (Vivo.com) అధికారిక వెబ్సైట్లో లిస్ట్ అయింది.
వివో V70 లైట్ స్పెసిఫికేషన్లు :
వివో V70 లైట్ ఫోన్ 6.77-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే అమోలెడ్ స్క్రీన్ అందిస్తుంది. ఈ ఫోన్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. పంచ్-హోల్ డిజైన్‌తో 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సేఫ్టీ కోసం కంపెనీ అండర్-డిస్ప్లే స్కానర్‌ను కూడా చేర్చింది.
వివో V70 లైట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో సోనీ IMX882 సెన్సార్, ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది.
కంపెనీ 8MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఈ వివో ఫోన్లో భారీ 6500mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఆరిజిన్ ఓఎస్ 6 స్కిన్‌తో వస్తుంది.
