Vivo X Fold 3 Pro : వివో ఆఫర్ అదుర్స్.. ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌పై ఏకంగా రూ. 33వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Vivo X Fold 3 Pro : వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ ఫుల్ డే బ్యాటరీ లైఫ్‌తో వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Vivo X Fold 3 Pro
- వివో ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ ధర భారీగా తగ్గింది
- వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోపై రూ. 33వేలు ఆదా
- ప్రారంభ ధర కన్నా రూ. 33,899 తక్కువకే కొనేసుకోవచ్చు
Vivo X Fold 3 Pro : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. పవర్ ఫుల్ టెక్నాలజీతో లగ్జరీ లుక్ కోసం చూస్తుంటే ఈ వివో ఎక్స్ ఫోల్డ్ ఫోన్ కొనేసుకోవచ్చు. అమెజాన్‌లోని ఈ అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది.
లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా ఏకంగా రూ. 33,899 తక్కువకే (Vivo X Fold 3 Pro) అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, పవర్ఫుల్ కెమెరా సెటప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ఫోల్డబుల్ కేటగిరీలో బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు.
తగ్గింపు ఆఫర్ :
వివో ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్ అందిస్తోంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో ఈ ప్రీమియం వేరియంట్ రూ. 1,59,999 ధరపై రూ. 30వేలు నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడు అమెజాన్‌లో రూ. 1,29,999కే లభిస్తోంది.
Read Also : Best AI Tools 2026 : టాప్ క్రియేటర్లు వాడే ఫేవరెట్ AI టూల్స్ ఇవే.. మీరు ట్రై చేశారా? ఒక్కసారి వాడితే వదలరు!
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డును వాడితే అదనంగా రూ. 3,899 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అసలు ధర రూ. 1,26,100కు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఏకంగా రూ. 37,650 డిస్కౌంట్ పొందవచ్చు.
డిస్ప్లే, పర్ఫార్మెన్స్ :
పర్ఫార్మెన్స్ పరంగా వివో X ఫోల్డ్ 3 ప్రో ఫోన్ అద్భుతమైన 4500 నిట్స్ ప్రకాశంతో 8.03-అంగుళాల మెయిన్ E7 అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15తో అద్భుతమైన 6.53-అంగుళాల కవర్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.
జైస్ కెమెరా సెటప్ :
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ పవర్ఫుల్ కెమెరా సెటప్ అందిస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 64MP టెలిఫోటో లెన్స్ 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అద్భుతంగా ఉంటుంది.
బ్యాటరీ, కనెక్టివిటీ :
వివో పవర్ఫుల్ 5700mAh బ్యాటరీని అమర్చింది. 100W వైర్డ్ ఛార్జింగ్ 50W వైర్లెస్ ఛార్జింగ్ అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వై-ఫై 7 5జీ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
