Vivo X300 Series : కొత్త వివో ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. కెమెరా ఫీచర్లు మాత్రం DSLR రేంజ్ అంతే.. ధర కూడా మీ బడ్జెట్లోనే..?
Vivo X300 Series : కొత్త వివో X300 సిరీస్ వచ్చేస్తోంది. వివో X300, వివో X300 అల్ట్రా ఫోన్ స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Vivo X300 Series : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన న్యూస్.. వివో నుంచి సరికొత్త సిరీస్ వచ్చేస్తోంది. వివో ఎక్స్300 అల్ట్రా, వివో ఎక్స్ 300 ఎఫ్ఈ అతి త్వరలో లాంచ్ కానున్నాయి. వివో X300 అల్ట్రా త్వరలో భారత మార్కెట్లోకి రానుంది.

ఈ వివో X300 ఎఫ్ఈతో పాటుగా రానుంది. లాంచ్‌కు ముందుగానే డిజైన్ వెల్లడైంది. చైనీస్ వేరియంట్ మాదిరిగా రౌండెడ్ కెమెరా మాడ్యూల్తో వస్తుంది. వివో X300 అల్ట్రా, వివో X300 ఎఫ్ఈకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వివో X300 FE స్పెసిఫికేషన్లు (లీక్) : వివో X300 ఎఫ్ఈలో 6.31-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందని అంచనా. 120Hz రిఫ్రెష్ రేట్, హై బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్తో వస్తుంది. LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందిస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా.

ఇందులో OISతో 50MP సోనీ ప్రైమరీ సెన్సార్, అల్ట్రావైడ్ లెన్స్, 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్లో 90W వైర్డ్ 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో పాటు 6500mAh బ్యాటరీ కూడా ఉంటుందని అంచనా.

వివో X300 అల్ట్రా స్పెసిఫికేషన్లు (లీక్) : మరోవైపు, వివో X300 అల్ట్రా ఫొటోగ్రఫీపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల 2K ఎల్టీపీఓ డిస్ప్లే అందిస్తుందని అంచనా. ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ ఉండవచ్చు. బ్యాటరీ విషయానికొస్తే.. 100W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,600mAh బ్యాటరీని అందిస్తుందని భావిస్తున్నారు.

కెమెరాల విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 200MP ప్రైమరీ సెన్సార్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు అదనపు ఇమేజింగ్ హార్డ్‌వేర్ ZEISS ఆప్టిక్స్ ఉంటాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఎక్స్టర్నల్ టెలిఫొటో కన్వర్టర్ కిట్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని వివో ధృవీకరించింది.

వివో X300 అల్ట్రా, వివో X300FE లాంచ్, ధర (అంచనా) : వివో ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని వెల్లడించనప్పటికీ, ఈ రెండు ఫోన్లు మే 7న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. అలాగే మే 14 నుంచి అమ్మకానికి రావచ్చు. ధర విషయానికొస్తే.. అంచనాల ప్రకారం.. వివో X300 అల్ట్రా ధర సుమారు రూ. 1,39,999 నుంచి ప్రారంభం కానుంది. వివో X300FE ధర సుమారు రూ. 54,999 ఉండవచ్చని అంచనా.
