Vivo Y200 Pro 5G : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో Y200 ప్రో 5G అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..
Vivo Y200 Pro 5G : వివో Y200 ప్రో 5జీ ఫోన్ రూ. 20వేల లోపు ధరకే లభిస్తోంది. ఈ వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7వేలు తగ్గింపుతో లభిస్తోంది. పూర్తి ఆఫర్ వివరాలివే..
Vivo Y200 Pro 5G
- వివో Y200 ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే
- 64MP ప్రైమరీ కెమెరా, భారీ 5,000mAh బ్యాటరీ సెటప్
- 16MP ఫ్రంట్ కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు
Vivo Y200 Pro 5G : వివోనా మజాకా.. వివో ఫోన్లకు భారత మార్కెట్లో ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. మీరు వివో లవర్స్ అయితే ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. మీ బడ్జెట్ రూ. 20వేల లోపు అయితే ఈ వివో 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే కొనేసుకోవచ్చు.
ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్లతో వివో Y200 ప్రో 5జీ ఫోన్ భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో ఫోన్ (Vivo Y200 Pro 5G) ఎంత తగ్గింది? ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
వివో Y200 ప్రో 5G ధర, ఆఫర్లు :
వివో Y200 ప్రో 5జీ ఫోన్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999 లాంచ్ ధరతో పోలిస్తే.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18వేలకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 900 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ. 17,100కు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. వివో ఫోన్ లాంచ్ ధర కన్నా దాదాపు రూ. 7,899 తగ్గింపుతో లభిస్తోంది.
వివో Y200 ప్రో 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో Y200 ప్రో 5జీలో ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 1300 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ అందిస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
కెమెరా విషయానికి వస్తే.. వివో Y200 ప్రో 5జీలో బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ కెమెరా, 2MP బోకె కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు, భారీ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది.
