Vivo Y31t vs Realme 16x 5G : ఒకే ధర.. రెండు 5G ఫోన్లు.. రూ.25,999 బడ్జెట్లో ఏది కొనాలి? ఫుల్ డిటెయిల్స్
Vivo Y31t vs Realme 16x 5G : రూ.25,999 ధరలో లభించే ఈ రెండు ఫోన్లలో డిస్ప్లే, చిప్సెట్, కెమెరా, బ్యాటరీ, స్టోరేజ్ పరంగా ఏది బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Vivo Y31t vs Realme 16x 5G
- భారత మార్కెట్లో ఈ రెండు ఫోన్ల ధర రూ. 25,999 మాత్రమే
- వివో Y31t భారీ7,200mAh బ్యాటరీతో వస్తుంది
- రియల్‌మి 16x ఫాస్ట్ 144Hz డిస్ప్లే, 45W ఛార్జింగ్
Vivo Y31t vs Realme 16x 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కావాలా? అయితే, మీకోసం భారత మార్కెట్లో రూ. రూ.25,999 బడ్జెట్లో రెండు ఖతర్నాక్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
కొత్త 5G ఫోన్ తీసుకోవాంటే ఈ రెండింట్లో మీ ఫేవరెట్ ఫోన్ ఏదో ఎంచుకోండి చాలు.. అయితే, వివో Y31t, రియల్‌మి 16x 5జీ ఫోన్లు (Vivo Y31t vs Realme 16x 5G) రెండూ అద్భుతంగా ఉంటాయి. ఈ ఫోన్ల ధర ఒకటే అయినా ఫీచర్ల విషయంలో చాలా తేడా ఉంది..
డిస్ప్లేలో రియల్మినే టాప్ :
వివో వై31టీలో 6.75-అంగుళాల HD+ LCD, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. గరిష్టంగా 1,250 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పాటు IP68, IP69 రేటింగ్స్ అందిస్తుంది. అదే రియల్ మి 16x ఫోన్ 6.8-అంగుళాల LCD, 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది. 1,200 నిట్స్ బ్రైట్నెస్, పాండా-1681 గ్లాస్, IP65 ప్రొటెక్షన్ అందిస్తుంది.
అసలు తేడా.. చిప్సెట్లోనే :
వివో వై31టీలో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2, 6GB ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. రియల్‌మి 16xలో డైమన్షిటీ 6300, 6GB ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ లభిస్తాయి. రెండు ఫోన్లలోనూ microSD ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు.
Read Also : Realme P4 Lite : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్.. రూ. 25వేల రియల్‌మి లైట్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే.. ఎలాగంటే?
బ్యాటరీలో వివోనే కింగ్ :
వివో వై31టీలో 7,200mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్ ఉండగా, రియల్‌మి 16xలో 7,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ విషయంలో వివోనే టాప్. ఛార్జింగ్‌లో రియల్‌మికి చిన్న ఎడ్జ్ అంతే..
కెమెరా మాత్రం సేమ్ :
ఈ 2 ఫోన్లలోనూ 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంది. వివో 2MP సెకండరీ కెమెరా ఉంది. మొత్తంగా చూస్తే, ఎక్కువ రిఫ్రెష్ రేట్ కావాలంటే రియల్‌మి 16x, భారీ బ్యాటరీ, మెరుగైన డస్ట్/వాటర్ ప్రొటెక్షన్ కావాలంటే వివో వై31టీ అద్భుతమైన ఆప్షన్.
ధరలో ఏది బెటర్ :
వివో వై31టీ భారత మార్కెట్లో రూ. 25,999 ధరతో లాంచ్ కాగా, రియల్‌మి 16ఎక్స్ కూడా రూ. 25,999 ధరకే లభించింది. ఈ రెండు ఫోన్లు ఒకటే.. ధర పరంగా పెద్ద తేడా లేదు.. ఫీచర్లలో మీకు ఏది బెటర్ అనేది మీరే నిర్ణయించుకోండి.
