WhatsApp Filters Effects : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. సింగిల్ క్లిక్‌తో ఫొటోలు, వీడియోలకు ఫిల్టర్ ఎఫెక్ట్స్..!

WhatsApp Filters Effects : మీ వాట్సాప్‌లో ఇంకా ఈ ఫీచర్ కనిపించడం లేదా? అయితే వెంటనే "గూగుల్ ప్లే స్టోర్‌లోని (Android 2.24.20.20)కు అప్‌డేట్‌ చేసుకోండి. లేటెస్టుగా వాట్సాప్ బీటాలో ఈ కెమెరా ఫిల్టర్ ఫీచర్ అందుబాటులో ఉంది.

WhatsApp Users Can Now Apply Filters Effects To Camera With Just A Simple Tap

WhatsApp Filters Effects : ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌లో కెమెరా ఇంటర్‌ఫేస్‌కు కొత్త ఫిల్టర్ బటన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫిల్టర్ బటన్ ద్వారా యూజర్లు కేవలం సింగిల్ ట్యాప్‌తో ఫిల్టర్‌లను అప్లయ్ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలను మరింత అందంగా డిజైన్ చేసుకోవచ్చు.

Read Also : Tech Tips in Telugu : వాట్సాప్‌లో అదిరే ట్రిక్.. కాంటాక్టు సేవ్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు తెలుసా? ఇదిగో 5 సింపుల్ టిప్స్..!

మీ వాట్సాప్‌లో ఇంకా ఈ ఫీచర్ కనిపించడం లేదా? అయితే వెంటనే “గూగుల్ ప్లే స్టోర్‌లోని (Android 2.24.20.20)కు అప్‌డేట్‌ చేసుకోండి. లేటెస్టుగా వాట్సాప్ బీటాలో ఈ కెమెరా ఫిల్టర్ ఫీచర్ అందుబాటులో ఉందని వాట్సాప్‌ వెబ్‌సైట్ (WABetaInfo) నివేదించింది.

ఇప్పటివరకూ వాట్సాప్‌లో ఏఆర్ ఎఫెక్ట్‌లు, వీడియో కాల్స్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే, వాట్సాప్ ఇప్పుడు ఈ ఫీచర్‌ని కెమెరాకు కూడా విస్తరిస్తోంది. దాంతో వినియోగదారులు వారి ఫొటోలు, వీడియోలను మరింత క్రియేటివిటీగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫిల్టర్ బటన్‌తో వినియోగదారులు తమ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయడానికి ముందు రియల్ టైమ్ ఎడ్జెస్ట్ చేసేలా ఫిల్టర్‌ల కోసం టోగుల్ (Toggle) చేయవచ్చు.

సెల్ఫీలకు ఈ ఫిల్టర్ ఎఫెక్ట్స్ అదుర్స్ :
వాట్సాప్‌ ఫిల్టర్‌లలో యూజర్లు తమ చర్మాన్ని మృదువుగా చేసే ఆప్షన్లు పొందవచ్చు. చర్మంపై మచ్చలు లేదా స్కిన్ టోన్‌లను తగ్గించడం ద్వారా ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు.. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్ బెస్ట్ అని చెప్పవచ్చు.

వినియోగదారులు ఫిల్టర్ ఎఫెక్ట్ అప్లయ్ చేసినా ఫొటోలు, వీడియోలు చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. నివేదిక ప్రకారం.. మెటా యాజమాన్యంలోని యాప్ గతంలో వీడియో కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ మార్చే ఫీచర్‌ను ఇంటిగ్రేట్ చేసింది. వినియోగదారులు ఇప్పుడు రియల్ టైమ్ వర్చువల్ వ్యూ కోసం ప్రొఫెషనల్ లుక్ ఉండేలా పూర్తిగా బ్లర్ చేయవచ్చు.

ఇప్పుడు బీటాలో.. త్వరలో అందరికి :
కెమెరా లో లైటింగ్ మోడ్ వంటి లైటింగ్ అడ్జెస్ట్ సపోర్టు అందిస్తుంది. చీకటిలో కూడా ఫొటోలు, వీడియోలను బ్రైట్‌గా స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. “కలర్ టింట్స్, లెన్స్ ఎఫెక్ట్స్ వంటి డైనమిక్ ఫిల్టర్‌లు, అదనపు విజువల్ ఫ్లెయిర్‌ను యాడ్ చేయొచ్చు. ప్రస్తుతం, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ బీటా లేటెస్ట్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో ఈ ఫిల్టర్ ఫీచర్ మరింత మంది యూజర్లకుఅందుబాటులోకి రానుంది.

Read Also : BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండుగే.. రూ. 345 రీఛార్జ్ ప్లాన్‌తో 60 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!