WhatsApp Web : వాట్సాప్ యూజర్లు ఎగిరిగంతేసే న్యూస్.. ఇక నో యాప్ డౌన్లోడ్.. బ్రౌజర్‌లోనే ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు!
WhatsApp Web : వాట్సాప్ వెబ్ కాలింగ్‌తో సహా అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. తద్వారా డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకుండా బ్రౌజర్ నుంచే ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
WhatsApp Web New Features
- వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్లు
- వీడియో, వాయిస్ కాలింగ్ కోసం డెస్క్ టాప్ యాప్ అక్కర్లేదు
- వాట్సాప్ వెబ్ లోనే అన్ని కాల్స్ ఈజీగా చేసుకోవచ్చు
WhatsApp Web : వాట్సాప్ యూజర్లకు పండగే పండగ.. యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. ఈసారి యూజర్ల కాలింగ్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపర్చేందుకు అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది.
మెటా యాజమాన్యంలోని ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు నేరుగా వాట్సాప్ వెబ్‌లో ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్ (WhatsApp Web) తీసుకొచ్చింది. ముఖ్యంగా, బ్రౌజర్ ద్వారా కాల్స్ చేసే యూజర్లు ఇకపై స్పెషల్ వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు.
అంతేకాదు.. కంపెనీ కాల్ ట్రాన్స్ఫర్, వెయిటింగ్ రూమ్, క్విక్హెచ్డి వీడియో, నాయిస్ సప్రెషన్ వంటి ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. మల్టీ డివైజ్‌లలో వాట్సాప్ వాడే యూజర్లకు చాలా బెస్ట్. రాబోయే వారాల్లో వెబ్ కాలింగ్ ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ వెబ్ నుంచే నేరుగా కాల్స్ :
వాట్సాప్ వెబ్‌కు రాబోయే అతిపెద్ద అప్డేట్ వెబ్ కాలింగ్. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ బ్రౌజర్ నుంచే నేరుగా ఒకరితో ఒకరు, గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి మీ పర్మిషన్ లేకున్నా మీ బ్రౌజర్ ద్వారా కాల్స్ చేయొచ్చు.
Read Also : Motor Insurance Rules : వాహనదారులకు రెడ్ అలర్ట్! వర్షాల్లో ఈ రూల్స్ పాటించకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావు..!
యూజర్లు కాల్స్ సమయంలో స్క్రీన్ షేరింగ్, ఎమోజీ రియాక్షన్స్ వంటి ఫీచర్లు పొందవచ్చు. వాట్సాప్ వెబ్‌లో స్పెసల్ కాల్స్ ట్యాబ్ కూడా ఉంది. రీసెంట్ కాల్స్, ఇష్టమైన కాంటాక్ట్స్, కాల్ హిస్టరీని కూడా చూడవచ్చు. కంపెనీ ప్రకారం.. వెబ్ కాల్స్‌పై టైమ్ లిమిట్ ఉండదు. ఈ ఫీచర్ వాడకంపై అదనపు ఛార్జీలు కూడా ఉండవు. వెబ్ కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో సేఫ్ ఉంటాయని వాట్సాప్ చెబుతోంది.
వాట్సాప్ ‘కాల్ ట్రాన్స్ఫర్’ అనే కొత్త ఫీచర్ వచ్చేసింది. ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్‌కు వాట్సాప్ కాల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కాల్స్ మధ్యలోనే ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్ కు ఈజీగా కాల్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు.. మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్ కాల్ స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఆఫీసులో లేదా ఇంట్లో మీ ల్యాప్‌టాప్‌లో ఆ కాల్‌ను ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కంటిన్యూ చేయొచ్చు. రోజంతా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల వంటి మల్టీ డివైజ్‌ల్లో వాట్సాప్‌ను వాడేవారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
వెయిటింగ్ రూమ్ గ్రూప్ కాల్స్‌పై కంట్రోలింగ్ :
గ్రూప్ కాల్స్ కోసం వాట్సాప్ వెయిటింగ్ రూమ్ ఫీచర్ తీసుకొచ్చింది. తద్వారా కాల్లో ఎవరు జాయిన్ అవ్వాలో కాల్ హోస్ట్ డిసైడ్ చేయొచ్చు. ఒక యూజర్ వాట్సాప్ కాల్ లింక్‌ను క్రియేట్ చేసి వారు జాయినింగ్ (Permission to Allow Join) ఆప్షన్ ఎంచుకోవచ్చు. అప్పుడు కాల్ లింక్ ద్వారా చేరే పార్టిసిపెంట్లు నేరుగా కాల్లో జాయిన్ అవ్వరు. ఒక వర్చువల్ వెయిటింగ్ రూమ్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. హోస్ట్ నుంచి అనుమతి పొందాక మాత్రమే వారు కాల్లో జాయిన్ అవ్వగలరు.
కాల్‌లోనే క్విక్ హెచ్డీ వీడియో క్వాలిటీ :
వీడియో కాల్ క్వాలిటీని పెంచేందుకు వాట్సాప్ క్విక్హెచ్డీ (QuickHD) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్ మొదలైన మొదటి కొన్ని సెకన్లలోనే హెచ్డీ (HD) వీడియోను అందించనుంది.
తద్వారా వీడియో క్వాలిటీ పెరిగేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. యూజర్లు వీడియో కాల్ చేసిన దగ్గర నుంచి క్లియర్ వీడియో ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. ఈ కొత్త అప్డేట్లో నాయిస్ సప్రెషన్ ఫీచర్ కూడా ఉంది. కాల్స్ సమయంలో నాయిస్ తగ్గించి ఆడియో స్పష్టంగా వినిపిస్తుంది.
