Xiaomi 17 Ultra Price : ఇది కదా డిస్కౌంట్.. షావోమీ 17 అల్ట్రాపై ఏకంగా రూ. 10వేలు తగ్గింపు.. డోంట్ మిస్!
Xiaomi 17 Ultra Price : షావోమీ 17 అల్ట్రా ఫోన్ అదిరింది.. రూ. 10వేలు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ఇంకా డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Xiaomi 17 Ultra Price
- భారత మార్కెట్లో షావోమీ 17 అల్ట్రా ధర రూ. 1,39,999
- అమెజాన్ బ్యాంకు ఆఫర్లతో రూ. 10వేలు డిస్కౌంట్
- మరింత ఆదా కోసం పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్
Xiaomi 17 Ultra Price : షావోమీ లవర్స్ మీకోసమే.. భారత్ మార్కెట్లో షావోమీ 17 అల్ట్రా భారీగా ధర తగ్గిందోచ్.. అత్యధిక ఫీచర్లతో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా కెమెరా పర్ఫార్మెన్స్ చూసి యూజర్లు ఫిదా అవుతున్నారు. ప్రీమియం ఫీచర్లకు తగట్టుగానే ప్రీమియం ధర పలుకుతోంది.
మీరు కూడా షావోమీ 17 అల్ట్రా కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. అమెజాన్‌లో అద్భుతమైన డీల్ రెడీగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10వేల వరకు (Xiaomi 17 Ultra Price) డబ్బులు ఆదా చేయొచ్చు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
షావోమీ 17 అల్ట్రా డీల్ :
భారత మార్కెట్లో షావోమీ 17 అల్ట్రా ఫోన్ ధర రూ. 1,39,999కు లభిస్తోంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ఈజీగా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
షావోమీ 17 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
షావోమీ 17 అల్ట్రాలో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. 6.9-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ పవర్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్లో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. షావోమీ 17 అల్ట్రా ఫోన్ బ్యాక్ సైడ్ లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 200MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 50MP కెమెరాతో వస్తుంది.
షావోమీ 17 అల్ట్రా కొనాలా? :
ఫొటోగ్రఫీ కోసమైతే షావోమీ 17 అల్ట్రాను తీసుకోవచ్చు. ఈ ఫోన్ కెమెరా సెటప్ చాలా అట్రాక్టివ్ ఉంటుంది. పవర్ఫుల్ కెమెరా కోరుకునే ఫొటోగ్రఫీ ప్రియులు, కంటెంట్ క్రియేటర్లకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
షావోమీ 17 అల్ట్రా ఫోన్ అనేది కేవలం కెమెరాలే కాదు. అద్భుతమైన డిస్ప్లే, ప్రీమియం డిజైన్ ఫ్లాగ్షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. అలాగే, ఫోన్ అదేపనిగా వాడినా బ్యాటరీ రోజంతా వస్తుంది. షావోమీ బాక్స్‌లో 90W ఛార్జర్ అందిస్తుంది. అవసరమైతే బ్యాటరీని వెంటనే టాప్ అప్ చేసుకోవచ్చు.
