Xiaomi 17T Sale : షావోమీ కొత్త 5G ఫోన్‌పై రూ.5,000 డిస్కౌంట్.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో సూపర్ డీల్
Xiaomi 17T Sale : గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయిన షావోమీ 17T కొత్త ఫోన్ ఇప్పుడు భారీగా తగ్గింది. అమెజాన్ ఈ-కామర్స్ సైట్లో చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Xiaomi 17T Sale
- షావోమీ 17టీ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 8500-అల్ట్రా ప్రాసెసర్
- 50MP లైట్ ఫ్యూజన్ కెమెరా, 6500mAh బ్యాటరీతో వస్తుంది
- 12జీబీ/256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 59,999 ధరకే
Xiaomi 17T Sale : షావోమీ లవర్స్ డోంట్ మిస్.. కొత్త షావోమీ 17T ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు, 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
అమెజాన్‌లో సరసమైన ధరలో కొనేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. షావోమీ 17Tపై డిస్కౌంట్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
షావోమీ 17టీ ధర, ఆఫర్లు :
అమెజాన్‌లో షావోమీ 17టీ ఫోన్ 12జీబీ/256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 59,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై తక్షణమే రూ. 5వేలు తగ్గింపు లభిస్తుంది. దాంతో ధర రూ. 54,999కి తగ్గుతుంది.
Read Also : EPFO New Update : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. UAN యాక్టివేషన్ ఇప్పుడు UMANG యాప్‌లోనే.. ఎలాగంటే?
మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు కొత్త షావోమీ ఫోన్ రూ. 38,300 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
షావోమీ 17టీలో 2756×1268 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా చూస్తు.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ OS 3, 6500mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 67W హైపర్‌ఛార్జ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరా విషయానికి వస్తే..
షావోమీ 17టీలో ఎఫ్/1.7 అపర్చర్ ఓఐఎస్ సపోర్ట్‌తో 50ఎంపీ లైట్ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/3.0 అపర్చర్ ఓఐఎస్ సపోర్ట్‌తో 50MP 5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఎఫ్/3.0 అపర్చర్‌తో 12ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, Wi-Fi 6, బ్లూటూత్ 6.0, NFC, జీపీఎస్, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
