Xiaomi Pad 8 Amazon : సూపర్ డిస్కౌంట్ బ్రో.. రూ. 10వేలు తక్కువకే షావోమీ ప్యాడ్ 8.. అమెజాన్ డీల్ అదుర్స్..!
Xiaomi Pad 8 Amazon : షావోమీ ప్యాడ్ 8 అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్ సమయంలో రూ. 10వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Xiaomi Pad 8 Amazon
- అమెజాన్‌లో షావోమీ ప్యాడ్ 8పై రూ. 10వేలు తగ్గింపు
- ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అదనంగా రూ. 3వేలు ఆదా
- 144Hz డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్ 9,200mAh బ్యాటరీ
Xiaomi Pad 8 Amazon : షావోమీ లవర్స్ మీకోసమే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సందర్భంగా అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కొత్త టాబ్లెట్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. నానో టెక్చర్లతో కూడిన షావోమీ ప్యాడ్ 8 ప్రస్తుతం రూ. 50వేల లోపు ధరకే లభిస్తోంది.
అంతేకాదు, బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అదనంగా మరింత ఆదా చేసుకోవచ్చు. ఈ షావోమీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్సెట్తో 11.2-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. అమెజాన్‌లో షావోమీ ప్యాడ్ 8 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
షావోమీ ప్యాడ్ 8 అమెజాన్ డీల్ :
నానో-టెక్చర్ డిస్ప్లేతో షావోమీ ప్యాడ్ 8 ధర రూ. 59,999కి లభిస్తోంది. కంపెనీ రూ. 10వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ద్వారా కేవలం రూ. 49,999కే అందిస్తోంది. ఈ ఆఫర్ 12GB+256GB వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఈ ఆఫర్‌ను ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డీల్‌తో అదనంగా రూ. 3వేలు తగ్గింపు కూడా పొందవచ్చు.
అమెజాన్ నెలకు కేవలం రూ. 1,582 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు తమ పాత డివైజ్‌లను ట్రేడ్-ఇన్ చేసి బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి రూ. 37,600 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
Read Also : Samsung Galaxy A56 Price : సూపర్ ఫోన్ బ్రో.. రూ. 32 వేల లోపే శాంసంగ్ గెలాక్సీ A56 5G మీ సొంతం..!
షావోమీ ప్యాడ్ 8 స్పెసిఫికేషన్లు :
నానో టెక్స్చర్తో షావోమీ ప్యాడ్ 8 ట్యాబ్.. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 11.2-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ షావోమీ ట్యాబ్ 800 నిట్స్ టాప్ బ్రైట్నెస్ చేరుకోగలదని కంపెనీ పేర్కొంది. HDR, వివిడ్ డాల్బీ విజన్ ప్రో-HDR రీడింగ్ మోడ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
ఈ టాబ్లెట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR5T ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎంచుకోవచ్చు. షావోమీ ప్యాడ్ 8 నానో టెక్చర్లలో యాక్టివ్ పెన్ సపోర్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ లభిస్తాయి.
ఈ టాబ్లెట్‌లో ఏఐ కాలిక్యులేషన్, షావోమీ క్రియేషన్, ఏఐ రైటింగ్, ఏఐ లైవ్ సబ్‌టైటిల్స్, ఏఐ వాయిస్ ఎన్హాన్స్మెంట్ వంటి ఏఐ ఇంటిగ్రేషన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ షావోమీ ట్యాబ్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత స్కిన్ షావోమీ హైపర్ఓఎస్ 3తో వస్తుంది.
ఈ షావోమీ ట్యాబ్ 9200mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్పీకర్ల విషయానికి వస్తే.. హై-రిజల్యూషన్ వైర్లెస్ ఆడియోతో ఇమ్మర్సివ్ క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి.
