Amit Shah: తెలంగాణలో బీజేపీదే అధికారం.. రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు? రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా ఫైర్

హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అమిత్ షా(Amit Shah), ఈవీఎంలపై వారి విమర్శలను తిప్పికొడుతూ రేవంత్ రెడ్డి ఎలా సీఎం అయ్యారో చెప్పాలని నిలదీశారు.

Amit shah slams rahul gandhi and congress over evm remarks in hyderabad

Amit Shah: హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనప్పుడల్లా ఈవీఎంలను, ఎస్ఐఆర్ ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ప్రతి కొన్ని నెలలకోసారి విదేశాలకు వెళ్లేవారు ప్రజాక్షేత్రంలో గెలవలేరని, రాజ్యాంగం పట్టుకుని తిరగడం కాకుండా పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు.

Arnab Cyclone: అర్నబ్ తుఫాన్‌తో ఏపీకి రూ.4,600 కోట్ల భారీ నష్టం.. సీఎంతో ముగిసిన కేంద్ర బృందం భేటీ.. తక్షణ సహాయం కోసం వినతి!

ఈవీఎంల తీరుపై రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన హోంమంత్రి.. ప్రత్యేక సమావేశాలకు సవాల్:

ఈవీఎంలపై కాంగ్రెస్ వ్యాఖ్యలు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఉన్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈవీఎంలు నిజంగా సరిగ్గా పనిచేయకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యారని నిలదీశారు. ఈవీఎంలు, ఎస్ఐఆర్ అంశాలపై చర్చించేందుకు తాము ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకైనా సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

ఓటర్ల జాబితా సవరణ, చొరబాటుదారుల అంశం.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు:

దేశవ్యాప్తంగా నకిలీ, మరణించిన వారి ఓట్లను తొలగిస్తుంటే రాహుల్ గాంధీకి కడుపుమంటగా ఉందని విమర్శించారు. చొరబాటుదారులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు.

పదేళ్ల కాంగ్రెస్ అవినీతి వర్సెస్ మోదీ సుపరిపాలన.. అమిత్ షా స్పష్టం:

కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని, కానీ మోదీ పాలనలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ అపారమైన ప్రజాదరణ ముందు రాహుల్ గాంధీ ఎక్కడా సరితూగరని ఆయన ఉద్ఘాటించారు.