Ration Dealer Posts : ఆ జిల్లాలో రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే..!
Ration Dealer Posts : తెలంగాణలోని ఆ జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- Dharani Pilli
- Updated on- June 1, 2026 / 12:53 PM IST
Applications Invited To Fill Ration Dealer Posts in ranga reddy district full details here
Ration Dealer Posts : రేషన్ షాపు డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ ఈ పోస్టుల భర్తీ ఏ జిల్లాలో అంటే రంగారెడ్డిలో. జిల్లాలోని కడ్తాల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు మండల తహసీల్దార్ ప్రకటన విడుదల చేశారు. కడ్తాల్ మండలంలోని మైసిగండి, వంపుగూడ, ముద్విన్ గ్రామాల్లో ఈ కొత్త డీలర్ల నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.
అర్హతలు, వయోపరిమితి వివరాలు
-
చివరి తేదీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావించే స్థానిక నిరుద్యోగ అభ్యర్థులు జూన్ 11వ తేదీ లోపు తమ దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
-
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఏంటంటే.. ఏడో తరగతి లేదా పదో తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించారు.
-
వయోపరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎంపిక విధానం, కావలసిన పత్రాలు
ఈ నియామకాల్లో స్థానిక గ్రామ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు క్రింది పత్రాలను గడువు ముగిసేలోగా అందజేయాలి:
-
విద్యార్హత పత్రాలు (Educational Certificates)
-
స్థానికత ధ్రువీకరణ పత్రం (Residence Certificate)
-
కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate)
ఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి తహసీల్దార్ ఆధ్వర్యంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి తుది విజేతలను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా గ్రామాలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు.
