Harish Rao : 420 మ్యానిఫెస్టో, మాది కాపీ కొట్టారు- కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ రావు ఫైర్

Harish Rao Slams Congress Manifesto : ఆచరణ సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తోందా? రైతు బంధు, కల్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం మేము అమలు చేస్తున్నవే.

Harish Rao : 420 మ్యానిఫెస్టో, మాది కాపీ కొట్టారు- కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ రావు ఫైర్

Harish Rao Slams Congress Manifesto

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోపై అధికార బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ది 42 పేజీల మ్యానిఫెస్టో కాదు 420 మ్యానిఫెస్టో అని విరుచుకుపడ్డారాయన.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఎలాగూ గెలిచేది లేదని కాంగ్రెస్ కు తెలిసిపోయిందని, అందుకే అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పేజీలకు పేజీలు రాశారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు అంటూ విరుచుకుపడ్డారు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నాం.. అక్కడి ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు అని ఆయన వాపోయారు. 420 మ్యానిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చింది అంటూ కాంగ్రెస్ పై సీరియస్ అయ్యారు.

Also Read : మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

”జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఆచరణ సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తోందా? రైతు బంధు, కల్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం మేము అమలు చేస్తున్నవే. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టింది” అని విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైనా నిప్పులు చెరిగారు మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఈటల రాజేందర్ చేసిన విమర్శలకు మంత్రి హరీశ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ”సంతకం పెట్టి అప్పులు తెచ్చింది నువ్వే కదా ఈటల రాజేందర్. రెండేళ్లు ఆరోగ్య మంత్రిగా ఏం చేశావు? అప్పుడు కేసీఆర్ మంచోడు, గొప్పొడు అన్నావ్. పార్టీ మారగానే మాట మార్చావ్. గజ్వేల్ అభివృది చెందినట్టు హుజురాబాద్ చేశావా? ఓట్ల కోసం జూటా మాటలు మాట్లాడుతున్నావు. అన్నం పెట్టిన కేసీఆర్ ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వు” అంటూ నిప్పులు చెరిగారు మంత్రి హరీశ్ రావు.

Also Read : ఓడితే కేసీఆర్‌ను కేటీఆర్ వృద్ధాశ్రమంలో చేర్చేస్తారు : బండి సంజయ్