Ronald Ross : ఓటర్ల కోసం కొత్త యాప్, 4వేల పోలింగ్ స్టేషన్లు- హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్

పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 125శాతం ఈవీఎంలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 29వ తేదీ నుండి ఈవీఎంలు పంపిణీ చేస్తామన్నారు.

Ronald Ross : ఓటర్ల కోసం కొత్త యాప్, 4వేల పోలింగ్ స్టేషన్లు- హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్

Hyderabad District Election Officer Ronald Ross (Photo : Google)

హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. 312మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులు రేపు (నవంబర్ 28) సాయంత్రం 5గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత ప్రచారం బంద్ అవుతుందన్నారు. అన్ని అడ్వర్టైజ్ మెంట్స్ తొలగిస్తామన్నారు.

4వేల 119 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. 369 సెక్టార్స్, రూట్స్ ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. పోలింగ్ కోసం 20వేల మంది సిబ్బందిని ఉపయోగించుకుంటున్నాము అని రొనాల్డ్ రాస్ చెప్పారు. 20వేల డూప్లికేట్లు తొలగించామని వివరించారు. హోమ్ ఓటింగ్ కోసం 835మంది అప్లయ్ చేసుకోగా 733మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు వేశారని వెల్లడించారు.

Also Read : రైతుబంధు పథకాన్ని నిలిపివేయొద్దు.. ఈసీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ వినతి

పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 1,678 లొకేషన్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.79.07 కోట్లు సీజ్ చేశామన్నారు. అందులో రూ.42.25 కోట్లు క్యాష్ ఉందన్నారు. 3.5కోట్ల విలువైన లిక్కర్ సీజ్ చేశామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 45లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 8లక్షల మంది యూత్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.

సి.విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 1,136. దానిపై 250 టీమ్స్ ఫీల్డ్ మీద తిరుగుతున్నాయన్నారు. ఓటింగ్ కేంద్రం వద్ద రద్దీ ఎలా ఉంది? అని తెలుకోవడానికి క్యు అనే ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని, దాని ద్వారా ఓటు వెయ్యడానికి ఎప్పుడు వెళ్లాలి? అని ఓటర్లు ప్లాన్ చేసుకోవచ్చన్నారు.

Also Read : మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే.. ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారు : ప్రియాంక గాంధీ

ఓటర్లకు ఏమైనా డౌట్లు ఉంటే 1950కి కాల్ చేయొచ్చన్నారు. ఇప్పటికే ప్రతిరోజు వెయ్యికి పైగా కాల్స్ వస్తున్నాయన్నారు. ఈనెల 30న ఉదయం 5.30కు మాక్ పోలింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. 8వేల మంది పోస్టల్ బ్యాలెట్ కు అప్లయ్ చేసుకున్నారని, అందులో 6వేల మందికి ఓటింగ్ అవకాశం కల్పించామన్నారు. 600మందిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశామన్నారు. 125శాతం ఈవీఎంలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 29వ తేదీ నుండి ఈవీఎంలు పంపిణీ చేస్తామన్నారు. 75 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు.