Colleges Bandh: జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్
ప్రభుత్వ బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్(Colleges Bandh)కు పిలుపునిచ్చారు.
BC Associations called for a college bandh on June 30 demanding payment of reimbursement arrears.
- కాలేజీల బంద్‌కు పిలుపు.
- బకాయిలు విడుదల చేయాలి.
- చలో హైదరాబాద్ మార్చ్.
Colleges Bandh: తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దాదాపు రూ. 8 వేల కోట్ల పాత బకాయిలు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగిన వివిధ బీసీ సంఘాల సమావేశాలలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Madras High Court: ఇస్లాంలోకి మారితే బీసీ హోదా రద్దు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్(Colleges Bandh)కు పిలుపునిచ్చారు. కాలేజీల బంద్‌తో పాటు అదే రోజున రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
మరోవైపు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన బీసీ విద్యార్థి, యువజన సంఘాల సమావేశంలో మరికొన్ని కార్యాచరణలను ప్రకటించారు. జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపేందుకు జూలై 15న సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ఎత్తున ‘చలో హైదరాబాద్’ విద్యార్థి మార్చ్‌ను చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
