MLC Kavitha : ఇటిక్యాల రోడ్ షోలో సృహ తప్పిన ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవతి సృహ తప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

MLC Kavitha : ఇటిక్యాల రోడ్ షోలో సృహ తప్పిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha fell unconscious

BRS MLC Kavitha : జగిత్యాల రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత సృహ తప్పారు. రోడ్ షోలో తోటి నేతలు మాట్లాడుతుండా కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఎండ ఎక్కువగా ఉండటంతో కవిత కాస్త ఇబ్బంది పడ్డారు. అలాగే కాసేపు తల వాల్చుకుని ఉండిపోయారు. కానీ ఐదు నిమిషాల తరువాత తిరిగి కోలుకున్నారు. అప్పటికే ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న తోటి నేతలు ఆందోళన చెందారు.  ఆమెను పలకరించగా ఫరవాలేదు ఇప్పుడు కాస్త బాగానే ఉంది అంటూ సర్ధుకున్నారు.

కానీ కాసేపటికే ఆమె మరోసారి ఇబ్బందికి గురి కావటంతో పక్కనే ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి సూచనమేరకు వాహనంలో కూర్చుండిపోయారు. కవిత పరిస్థితి చూసి అక్కడున్నవారంతా ఆందోళన చెందారు. ఎండలో కవిత ప్రచారం నిర్వహించటం,  విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం వల్ల ఇలా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది.

కాగా కవిత వరసగా ఎన్నికల ప్రచారాలతో దూసుకుపోతున్నారు. జగిత్యాలలోని మైతాపూర్ లో కూడా ఈరోజు ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి చెప్పుకొచ్చారు. కష్టాలలో ఉన్న బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నెరవేర్చారని అటువంటి బీఆర్ఎస్ ను మరోసారి గెలిపించాలని కోరారు. తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవాలంటే మరోసారి గెలిపించాలని కోరారు.