BRS MLC Kavitha : ట్రాఫిక్ జామ్.. స్కూటీపై నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో వైరల్

నిజామాబాద్ జిల్లా బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్‌ బోధన్‌ ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ కు దాఖలుకు ముందు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

BRS MLC Kavitha : ట్రాఫిక్ జామ్.. స్కూటీపై నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో వైరల్

MLC Kavitha

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్కూటీపై ప్రయాణించారు. సామాన్యురాలిగా ఆమె స్కూటీపై వెళ్తుండటం చూసిన స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెకు అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్‌ బోధన్‌ ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు.

నామినేషన్  దాఖలుకు ముందు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ ర్యాలీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. ఆమె వెళ్తున్న దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఆమె వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీంతో ఎమ్మెల్సీ కవిత ర్యాలీ ప్రారంభ స్థలికి చేరుకొనేందుకు స్కూటీపై ప్రయాణించారు. ఓ వ్యక్తి స్కూటీని నడుపుతుండగా కవిత వెనుకాల కూర్చొని ప్రయాణించారు. స్కూటీపై వెళ్తున్న కవితను చూసిన స్థానికులు చేతులు ఊపుతూ ఆమెకు అభివాదం చేశారు. మరికొందరు ఫోన్ లతో ఫొటోలు తీసుకున్నారు.